పుట:Chatu Padya Ratnakaramu - Deepala Pichchayya Sastry.pdf/63

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

46

చాటుపద్యరత్నాకరము

ఈకవి యొకవేశ్యపైఁ జెప్పిన పద్యము

సీ. దురుసానిమై నున్నబురుసాపనిరుమాలు
            కరసారసమున నొక్కపరి విసరి
   కురుదాపడనిలీల పరదా వెడలి వచ్చు
            సరదా తెలియఁ బైట జార విడిచి
   అఱజారుకురులు క్రమ్మఱ జాఱిపడి వ్రాలు
            విరజాజిపువ్వుల విసరి విసరి
   వెఱబాఱుగాలి నౌ పొరబాటు విడ మారు
            దరబారుపావడఁ దార్చి తార్చి
   పకడుగలకమ్మవిలుకానిహుకుమతీమ
   తలబుజాహిరుగాషక్తు తలఁపుఁజేయు
   దీనిఫక్తుతమాషాఖుషీనిషాల
   ఖిలవతురభీకు నయినను దెలియ వశమె?

చెళ్ళపిళ్ళ నరసకవి

ఈప్రౌఢకవి నివాసగ్రామము గోదావరీమండలములోని కడియము. ఈయని పదునెనిమిదవ శతాబ్దిలో నున్నవాఁడు.ఈకవిరచితములగు గ్రంథములు 1. యామినీపూర్ణతిలకావిలాసము, 2. వేంకటేశ్వరవిలాసము, 3. ఏకప్రాసకంద గోపాలశతకము, 4. అహల్యాసంక్రందనవిలాసము, 5. ఏకాంతసేవాకలాపము. ఈకవిచంఢ్రుఁ డాశుకవితారచనయందు మిగులఁ బ్రజ్ఞఁ గలవాఁడు. ఈయన కాదొండకాయలపైఁ బ్రీతిమెండు. ఒకానొకప్పుడు పొలములో నాదొండకాయలు గోయుచుండ వెంట