ద్వితీయతరంగము
105
పవికరాభీలసంభగ్నాంతరంగుఁడై
మున్నీటిలోపల మునుఁగఁడేని
కలశోద్భవునిచేత గాసిఁ జెందక సదా
స్పర్శార్హవృత్తిఁ దాఁజలిపె నేని
అమరావళికి నెల్లనమృత మిచ్చెడుతఱి
నెమ్మోము నీలిమఁ గ్రమ్మదేని
యాకృతిని ధీరత గభీరిమను వితరణ
మున సుమాస్త్రు మైనాకసముద్రవిధుల
నగును గుమ్మడివెల్లివంశాగ్రగణ్యుఁ
గృష్ణయవదాన్యుఁ బోల్ప నీపృథ్వియందు.
కోఠి సుబ్బారాయఁడు
శా. ప్రత్యబ్దత్వదుదాత్తదానధరణీద్రవ్యాగ్రహారాఢ్యసౌ
హిత్యేచ్ఛద్విజపంక్తి దీవన లిడున్ “హేభూపవర్యాగ్రణి
ప్రత్యగ్రప్రభుతా జయో౽స్తు భవతః ప్రాయో” యటంచున్ బలౌ
ద్ధత్యప్రాభవకోఠిసంతతిపవిత్రా! సుబ్బరాయాధిపా!
వరదామాత్యుఁడు
మ. శరదంభోధరకాలకంధరహరిస్వర్గోహిమాద్రిస్వరా
డ్ఢరిహంసామరవాహినీబలసమీరాహారజైవాతృకుల్
కరుణాంభోనిధి మంత్రిపుంగవుఁడు సత్కల్పావనీజాతమా
వరదామాత్యునికీర్తితోడ సరి జెప్పం బోల దెబ్భంగులన్.
గోపరాజు రామప్రధానుఁడు
ఈరామప్రధానుఁ డొకరాజసంస్థానమున మంత్రిగా నుండెను. ఆకాలమునఁ గరణీకవృత్తి కమసాలులదై యుండగా