38 చంపూరామాయణము
| ర్పరంబునఁ గుంటుపడి మగుడువేగం బడరఁ బుడమికి డిగి నలుగడల వెల్లివిరిసి పెల్లగుచుంజాలుకొని యిద్దరులు నేరుపడు నుద్దవిడి నేఱుబడి వెడలి పులియడుగుతపసికొడుకు వెనుకొనెడు పాలకడలి వడువున, వసంతసమయంబు ననుసరించు కుసుమసముదయసమృద్ధిపగిది, విశదపక్షానుశీలనాలక్షితవినోద యగు కౌముదీసమితిరీతిఁ, గృత్తికాషట్కంబుననువర్తించు కార్తికనిశాచక్రవర్తిమూర్తిలాగునఁ, బరమభాగవతుననుగతికి హత్తు సత్త్వగుణసంపద విధంబున, వదాన్యమూర్ధన్యునకు ననుకూల యగుకీర్తిబాలిక పోలిక, భగీరథురథంబు వెంటనంటి పంటవలంతికంటసరి సరవి మీఱి నీహారగిరికుమారి భాగీరథీప్రథాసమాకలిత యై యనేకనగరఖేటకర్వటీగ్రామటీకోటులందాఁటి జహ్నుమునిసవననాటిపై నాటోపగరిమ నెఱపం గోపించి పుక్కిటఁ జిక్కంబట్టి యెట్టకేలకు గరుణవుట్టి యాజటివరుండు కర్ణఫుటి విడువఁ గడువడిం గదలి జాహ్నవీసమాహ్వాయంబు మెఱయ నరిగి సాగరులపయిం బఱవ నయ్యేటి వరవ నమ్మేటియఱువదివేవురునరేంద్రనందనులు సంక్రందనపురంబుఁ జెంది రంత భవదీయవంశకర్తయగు సగరప్రణప్త సంతర్పితపితామహగురుప్రసాదాసాదిత ప్రాజ్యసామ్రాజ్యవైభవుం డై యుండె. పుండరీకలోచనా! సమాచీన యౌష్మాకీణకుల | 25 |
మ. | అని మందాకిని భూమికిం దిగినచర్యం దెల్పి యాలోకపా | 26 |
సీ. | అఖిలమోహిని యైనహరి మాయచే వజ్రి యమృతాపహృతి కేగునసురవరులఁ | |