అష్టమాశ్వాసము
125
వ. | కాంచి యుదంచితాశ్చర్యధుర్యాంతరంగుం డై యారాజపుంగవుం డిట్లనియె. | 14 |
ఉ. | ఎవ్వనిలోఁతు చూడ నురగేంద్రుఁడు చాలఁడు నెల్లమేరలం | 15 |
క. | అంతట సుగ్రీవుఁడు మహి, కాంతునియనుమతి మహేంద్రఘనవనవేలో | 16 |
చ. | సరసపటీరకుంజవనసంజవనాభిపతన్మృగీమద | 17 |
వ. | అంత నిరంతరసమాక్రాంతహరిదంతరం బై నడయాడురెండవసముద్రం బనంగ సముద్రతీరంబున రోదసీవిలంఘనవిశృంఖలలాఘవం బగురాఘవానీకం బనీకోన్ముఖం బగుట, చారముఖంబున నవధరించి ధార్యమాణహృదయాతంకుం డై పంకలీనచరణం బగునైరావణంబుకరణి రావణుండు కరణీయంబు నెయ్యది యెఱుంగక జనకరాజతనూజ నుజ్జగింపం జాలక మనోజపరతంత్రితుండై మంత్రులం గూడి కొలువుకూటంబునకు వచ్చి యచ్చట. | 18 |
క. | శస్తవచస్తుతు లైనప్ర, హస్తాదులఁ జూచి యస్మదభిలాష మిదే | 19 |
సీ. | అనవుడు వార లి ట్లని రాశయ మెఱింగి స్వామి తావకనిదేశం బొనర్చు | |
గీ. | మగుట వచియించె నిటులన్నయన్నఁ జూచి, విన్నప మొనర్చె విజ్ఞానవినయభూష | 20 |
రావణునకు విభీషణుఁడు హితము చెప్పుట
గీ. | అకట దైవాజ్ఞఁ బరకళత్రానురాగ, లాలసుఁడ వైతివి దవాగ్నికీలఁ జూచి | 21 |