షష్ఠాశ్వాసము
91
సీ. | సుమనో౽పచయ మయ్యె సుదతిచూడ్కుల కబ్బుజనములందు వినోదవనములందుఁ | |
గీ. | నొదవెఁ గడురంగు రక్తియు మదనవీర, కదనజయభద్రకాహళీకలకలాను | 7 |
సీ. | నవలాకటాక్షంబునకు నోఁచెఁ దిలకంబు సకియమో మీఁదగెఁ జంపకంబు | |
గీ. | మాటవినెఁ బాటయాలించెఁ బోఁటివలన, గోఁగుప్రేంకణ మనఁగ లోకులకు నింకఁ | 8 |
వ. | ఇట్లు జాతకౌతూహలావహదశావతారగౌరవుం డైనమాధవుండు కూర్మిఱేఁడై తావుకొన ఠీవిమెఱయు వనరాశిలో నమందరాగం బభినవానంతమణికిరణమహెగ్రాహిగుణయుతంబుగాఁ బలాశసుమనఃపరంపర లలవరింప నత్తఱిం గరం బుద్భవిల్లి యుద్వేలకాలకంఠకంఠనిర్భరార్భటీరసాలంబుఁ జెంది రంభాదు లమరగణికలు ప్రభూతలై తనరఁ, గైతకరజోవిసరపరిపాండురాంగసారంగంబు లసమాసజననతం జెలంగఁ, జంద్రమండలసుధామధురసోద్యల్లతాంతసంతానమందారపారిజాతప్రభృతు లభ్యుదయంబు నెనయ, నంత నెన యిడంగరాని మేనిసౌందర్యంబుతో దోఁచునిందిరాదేవి యన, భుజాంతరనిశాంతవిశ్రాంతిం జెందినట్లై, యనంగశాంబరీవిజృంభణం బనెడు కాదంబినిం బొడమి యలయించుచంచలాలతికరీతి, లక్ష్యాలక్ష్యతరాకార యై మనోరథమయారామసీమ నుల్లసిల్లు కల్పవల్లియుల్లాసంబునఁ, బాటలప్రభాధరప్రవాళంబన మరులుకొలుపుచు, నవేలమోహమయవిభావరీసమాగమోదిత యై, శీతాంశురేఖ యన, లోచనచకోరికల నూరించు సంచితగుణాభిజాత యగుసీత డెందంబునం దవిలి జూలినొందింపఁ బంపాతటరసాలసాలమూలశీతలశీలోపరి నధివసించి, పంచశరశరవికాసకారణపటీరగిరిమరుత్ప్రపంచసంచాలితగభీరతాశరధి యగు దాశరథి లక్ష్మణుం జూచి యిట్లని వితర్కింపందొడంగె. | 9 |