పుట:Chandrika-Parinayamu.pdf/72

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సుఖమును గలిగించెను. అట్లు వారు, హర్మ్యప్రదేశములందును, శైలకందరాస్థలులందును, ప్రకృతిసౌభాగ్యములఁ గనుచు, లక్ష్మీనారాయణులు, భవానీశంకరులు, శచీపురందరులు, ఛాయాసూర్యులు సకలకాలముల సుఖించినట్లు నిరంతర మిష్టోపభోగములఁ దేలుచు సుఖముండిరి. అట్లు చంద్రికాయుక్తుఁడై దేశప్రజలను బాలించు సుచంద్రుని రాజ్యమునందు దుర్మార్గులు నశించిరి. దుష్టులసంపదలు నశించెను. దారిద్ర్యము తొలఁగిపోయెను. శత్రుబాధ దూరమయ్యెను. ధర్మము, నీతియు వృద్ధిఁజెందెను. అవినీతి నశించెను. ప్రజలు శుభకార్యములతో సంతోషముతో నాయుర్భాగ్యములతో నుండిరి.

ఇది చంద్రికాపరిణయ

కథాసంగ్రహము