పుట:Chandrika-Parinayamu.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మ॥ “చెల్మికై , కర మేగన్ సురధేను వాస్య మటుగాఁ గావించె మధ్యేసృతిన్”

(ఆశ్వాప్ర. ప.61)

‘పారే మధ్యే షష్ఠ్యా వా’ యను సూత్రముచేత మధ్యేమార్గమువలె నీ ‘మధ్యేసృతి’ అనునదియు నలుక్సమాసమే. ‘సృ=గతౌ’ అను ధాతువుపై వచ్చిన ‘క్తిన్’ ప్రత్యయాంతరూపమే సృతి. అనఁగా సరణి, మార్గము మొదలగు అర్థములు గలది.

మ॥ “గళదర్కంబుఁ, బనీపతత్కుజము, రింఖద్గోత్రగోత్రంబుఁ, జా
చల దుర్వీవలయంబు, ఫక్కదఖిలాశాంకంబు, భిద్యన్నభ
స్స్థల మేఘౌఘము, భ్రశృద్బక్షము, రణత్పద్మాసనాండంబునై
యలరెన్ దన్మహిపాల జైత్రగమ బంభారావ మప్పట్టునన్.”

(ఆశ్వాప్ర. ప.151)

ఈపద్యమునం దాయా సంస్కృతధాతువులపై శతృప్రత్యయమును (అత్) చేర్చి వర్తమానార్థమున సమాసములయందుఁ గూర్చుట యొక చమత్కారమే కాదు, పాండిత్యవిశేషస్ఫోరకమును నగును. ధాతుజ్ఞానమును, బ్రక్రియావిశేషజ్ఞానమును నిట్టి ప్రయోగములు చేయుట కెంతయు నావశ్యకములు. గళ, పతౢ, రింఖ, చల, ఫక్క, భిదుర్, భ్రంశు, రణ ధాతువులపై శతృ (అత్) చేర్చి ‘గళత్’ ఇత్యాదిరూపములను సమాసగతములుగాఁ బ్రయోగించెను. వాటిలోను ‘పనీపతత్’, ‘చాచలత్’ అనునవి అతిశయార్థకము లగు యఙ్ఞుగంతధాతువులపై వచ్చిన రూపములు. ‘ఫక్కదఖిలాశాంకంబు’ అను ప్రయోగమునందు ‘ఆశా’శబ్దము నకు హ్రస్వము లేకపోవుటయు నొక వ్యాకరణవిశేషము. ఇది యంతయు నీకవి సంస్కృతవ్యాకరణజ్ఞత కుదాహరణము గా నోపును.

“ఆనృపతి దానెనసె మానసతటీ నివిశమాన ముదమంతన్”

(ఆశ్వాద్వి. ప.21)