పుట:Chandrika-Parinayamu.pdf/211

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సీ. తలిరాకు ద్రుంపరే కలకంఠసమవాయ
దర్పంబు దఱుఁగనీ తరుణులార,
విరిదుమ్ము దూల్పరే విస్ఫుటాసమవాయ
వీయాభ దెఱలనీ వెలఁదులార,
యలరులు దునుమరే యళి విలాసమ వాయఁ
గలఁకచే బ్రమయనీ చెలువలార,
ఫలకాళి గోయరే చిలుకచాల్ సమవాయ
గతిఁ జాల నడలనీ యతివలార,

తే. యని మనోంబుజవీథిఁ బాయని మదాప్తి
మారబలరాజ్యవష్టంభమారకప్ర
చార మూనుచు నపు డనీచారలీల
రామ లందఱు వెడలి రారామపదవి. 65

క. వరవనకేళీభవదు
స్తరఘనచూళీతనూతతశ్రమ ముడిపెన్
సరళలతాసరళలతా
విరళలతాంతాప్తపవనవిసరము లంతన్. 66

ఉ. ఆరమణీలలామనివహంబు గనుంగొనెఁ జెంత నున్నమ
త్సారముదారసాభియుతజాలపదార్భకదోలదూర్మికా
సారము దారసావరణసారసశోభితతీర మొక్క కా
సార ముదారసారసనిశాపవృతాసితఫేనతారమున్. 67

వ. కనుంగొని యభంగపదాంగదనిస్వానభంగిం దాము వచ్చుతెఱం గెఱింగి యుప్పొంగుచుం దటకటక కాననదేవతాజనంబులు దార్చిన విడిఁదిపిండులవడువునం గమనీయకళికాముక్తావళికావితానంబులం గమ్రసమీరసమాగమ గళత్కంకేళిపాళికా ప్రసవధూళికారింఛోళికా