పుట:Chandrika-Parinayamu.pdf/212

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రాంకవాస్తరణవితానంబులం గనక కక్ష్యామార్గ భాసమాన పరిపక్వ ఫలాభిరామ రంభాపూగంబులం గనత్సుగంధ మరందరసగంధ తైల బంధుర బంధుజీవకోరకదీపకళికాపూగంబులం గనుపట్టుచు రంగుమీఱు కూలరంగ రంగత్కుడుంగంబు లంతరంగంబునకు వేడుక రంగలింప మరాళమందయానా ధవళవర్ణ పరిపూరితంబై యొప్పుమీఱు ప్రతీరశోభనభవనంబున నిస్తులస్థలపద్మవివాహపీఠికాసీమం గూర్చున్న బెగ్గురుపెండ్లికొడుకునకు సుంకులు చల్ల ఘనవేణికాసమాజంబు విరంజిత కింజల్కకలమపుంజ సంజిత దరవికసితశోణకంజోదూఖలంబునన్ దంచు ముసలంబుల సొంపునఁ దదంతరంబునం బతనోత్పనంబు సలుపు మత్తమధుపమాలికలు లోచనానులాసంబు చాలం బొందింపఁ గాసారకళిందనందినీహ్రదప్రదేశంబు చయ్యనం జొరఁబాఱి కాలకమల లతాకాళియకాకోదరపర్యంకంబు మెట్టి తన్మృణాలభోగంబు వలఱెక్కకేలి సందునం బొందుపడ నిందీవరపలాశఫణాముఖంబుల మరందవిషపరంపరలు వెడల న్నిజకృష్ణమూర్తిభావంబు సార్థకంబై వర్తిల్ల నర్తనంబు సలుపు కలహంసకులావతంసంబులు ప్రశంసనీయంబులై చూపట్టఁ జందనాచలపవమాన కందళీసముద్గత లోహితారవిందరజోవ్రజ సమావృతగగనభాగకల్పిత సంధ్యాసమయ ముకుళితపుండరీ కాంతరసంవస దమందహిందోలఝంకారంబు లుపాంగంబులుగా నఖిలజగజ్జయసముజ్జృంభితశంబరారిబిరుదగద్యపద్యజిగాసా కలితమానస జలాధిదేవతాజనంబులు పూనిన పసిండికాయలదండియల దండిఁ దిర్యక్ప్రసారి తైకైకనాళకైకైకకోకరాజంబులు హర్షోత్కర్షంబు పచరింప మిత్రమండలసంయోజిత మహోత్సవంబు నవంబుగా నొంది యాత్మప్రియకామినీయుక్తంబై సారసచారులోచనాశుభగానంబు లనూనంబై తనరఁ గుశేశయనిజనివేశనూతనప్రవేశమంగళ మంగీకరింప నొయ్యనొయ్యన నరుదెంచు రథాంగవంశరత్నంబున కెత్త హల్లకినీపల్లవాధరామతల్లికలు పూనిన జాళువాకదలారతిపళ్లెరంబుల సొంపున హరిత్పరాగ హరిద్రాచూర్ణ సంవ్యాప్త తత్ప్రసవరసపూరాంతర దృశ్యమాన మానితకేసర భక్తాభిరామంబు లగు హల్లకస్తోమంబు లుల్లాసంబు పల్లవింపఁజేయ నిజాంత