పుట:Chandrika-Parinayamu.pdf/157

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కుం జన సకలజగద్వార పారావారగిళనపానసమ ర్థాక్షుద్రక్షుధోదన్యా పరి క్షుభితమానసంబు పక్షీకరించి యనేకకాంతారజంతుసంతానంబుల మెక్కుచుఁ, దదీయాసృక్పూ రంబు గ్రోలి సొక్కుచు, దుష్టవర్తనంబున నింతకాలం బిచ్చటఁ దిరిగి తిరిగి భవత్కరహేతిధారామాహా త్మ్యంబునఁ బూర్వరూపంబు గంటి, నీవలన మంటి నిన్ను నేమని సన్నుతింతు నని యత్తురంగవద నుండు వెండియుఁ బ్రణామంబులు గావించి యవ్విభుండు నయభాషణంబుల నుపలాలింప నానం దించె నప్పుడు. 141

తే. వరకలాసాంద్రుఁ డైన యావసుమతీశ
చంద్రు నలగోనికాయప్రచారమహిమ
కుముదుఁ డతిమంజులామోదసమితి నలరె
పుష్కరచరాళి వైచిత్రిఁ బొందుచుండ. 142

మ. కలితారాతివిరామ, రామరుచిసంగప్రస్ఫురద్భామ, భా
మలవక్త్రాహతసోమ, సోమనుతశుంభద్భూరిసంగ్రామ, గ్రా
మలసద్వేణుసకామ, కామకలిసంపల్లాలసశ్యామ, శ్యా
మలరోచిశ్చయవామ, వామనతనూమాన్యత్రిలోకీక్రమా! 143

క. సత్యాహితాంతరంగా
సత్యాశయపుండరీకచంచద్భృంగా,
సత్యాత్మకగుణసంగా
సత్యాలయయోగియోగసంతతరంగా! 144

ఉత్సాహ వృత్తము
కరివరాంగబహులభంగకరణసంగతగ్రహా
చరరథాంగ! హరిశతాంగజనక! రంగదద్రిజాం
తరసుమంగళాబ్జభృంగ!తతపతంగమందిరా!
పరభుజంగరిపుతురంగ!ప్రబలరంగభూషణా! 145