పుట:Chandrika-Parinayamu.pdf/156

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సీ. కురువిందరుచి నాజిఁ గుదియించు రదరాజి
వక్రతాశాతతావళిత మయ్యె,
నెలపుల్గుకవడంబు గలఁచునేత్రయుగంబు
వృత్తతాహరితతాయత్త మయ్యె,
నంబుదావళినీలి నడఁచుశిరోజాళి
ఖర్వతాశోణతాకలిత మయ్యె,
నలరుతామరగోము నలయించునెమ్మోము
వివృతతా విపులతాభివృత మయ్యె,

తే. నహహ! యని పశ్యదఖిలవాహాస్యవితతి
విస్మయం బూన బుధవర్ణ్యవిమలరూప
గౌరవంబున మించు మద్గాత్ర మపుడు
భీమకంఠీరవాకృతిస్థేమ గనియె. 140

వ. ఇట్టు లతులనాగవిదళనవ్యాపార నవీనశతమఖకరవాలాయమాన ఖరనఖరంబులును, నక్షీణమృగ క్షతజకటాజ్యధారా సముజ్జ్వల జ్జఠరజ్వలన సమున్నత జ్వాలాయమాన రసనాకిసలయంబును, నమందతుంద కారామందిర బందీకృత స్వభృత సారంగకులీన సారంగవిమోచనలాలసా విలసనోత్త మాంగ రాజసదన వదనద్వారాశ్రిత చంద్రరేఖాయమాన వక్రదంష్ట్రాయుగంబును, నాత్మీయహరి తానుబోధక భాస్వద్విరోచనమండలాయమాన నిస్తులలోచనద్వయంబును, నలయప్రభావోరరీకృ తాఖిలజంతు నికృంతన తంతన్యమాన చాతుర్యపృష్ఠేకృత కీనాశపాశాయమాన దీర్ఘవాలంబును, నతిఘనఘనాఘనస్థైర్య సమున్మీలనశీల నిబిరీసనిశ్వాసమారుత ప్రచారకారణ మహాబిలాయమాన నాసారంధ్రంబును, గల సింహాకారంబు నివ్వటిల్ల నుల్లంబు జల్లు మన మదాప్తజనంబులు చెంతల నిలువ లేక యెల్లెడల