పుట:Chandragupta-Chakravarti.pdf/64

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అయిదవ ప్రకరణము

63


యాతఁడు 350 వ సంవత్సర ప్రాంతమున జన్మించి యుండవలెను. మనమిట్లు తేల్చుకొనిన కాలనిర్ణయమంతయు నీక్రింది పట్టికలోఁ గనుపఱచఁ బడినది.

కీ. పూ.
350 చంద్రగుప్త జననము.
326, 325 అలెగ్జాండరును చూచుట
323 అక్టోబరు, 322 చంద్రగుప్తుఁడు పంజాబునుండి గ్రీకు వారిని వెడలఁగొట్టుట.
322, 321 మగధరాజ్యము నాక్రమించుకొనుట.
305, 304 సెల్యూకస్ హిందూదేశముమీదికి దండెత్తి వచ్చుట.
303 సెల్యూకసు పరాభవము, చంద్రగుప్తునితో సంధిచేసికొనుట.
298, 297 చంద్రగుప్తుని మరణము.