పుట:Chandragupta-Chakravarti.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాలుగవ ప్రకరణము

47


చంద్రగుప్తు డామెను తనకు భార్యగ నామె తండ్రి సమర్పించు నట్లు చేసెను. అటుపిమ్మట నా గ్రీకునాయకుఁడు తనకు 500 ఏనుఁగులు కావలయునని వేడ, ఒక గజగమనకు మూల్యముగ 500 గజముల నియ్యవచ్చునను వాడుక నమసరించి చంద్రగుప్తుడు మామకు బహుమానమంపెను. నాఁడు చంద్రగుప్తుని వలనఁ బడిన బాధలు మనస్సున నాటుకొనినందున గ్రీకులు ఈ దేశముపై దాడి వెడలుట కలలోనైనను దలంపరయిరి. కాని గ్రీకుదొర కుమారిత గాన, చంద్రగుప్తుని మహిషికిఁ బరివారములుగ ననేక గ్రీకులు పాటలియందు నివసించుచుండిరి. సెల్యూకసు తన రాష్ట్రపు పశ్చిమ ప్రాంతమున అంతిగోనసు అను పగతుఁడొకఁడు లేచి యభిద్రవించుట విని క్రీ.పూ.303వ సంవత్సరమున బయలుదేరి వెడలెను. కాని తనకు రాయబారిగ మెగాస్తనీసు అనువానిని నియమించి పాటలీపురమున నుండుమని నిలిపె. ఈ మెగాస్తనీసు పరివారములును, ఆ గ్రీకుసాని పరివారములును, మౌర్యసేనయం దమరియున్న శిల్పులును, చేతిపనివాండ్రును గలిసి యొక్క గ్రీకుపేటయే పాటలీపురమందున్న ట్లూహింపదగియున్నదని రిసుడేవిడ్సుని అభిప్రాయం. ఇందువలన మనదేశపు జనులకు శిల్పాదికృత్యములు తెలియవని భావముకాదు. *[1] మనవారినేర్పును గ్రీకులును గ్రీకుల నేర్పును మనజనులును నేర్చియుందు రందము.

  1. *శిల్పములు మున్నగువాని యందు హిందువుల నేర్పరి తనమునకు మెగాస్తనీసు వలసినంత దృఢసాక్ష్య మిచ్చినాఁడు.