పుట:Chandragupta-Chakravarti.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

46

చంద్రగుప్త చక్రవర్తి


ఱును వ్రాసియున్నారు. కాని సెల్యూకసు శరణువేడుటయు చంద్రగుప్తుఁ డభయమిచ్చుటయు జరుగుటకు బూర్వమే తమ చేతఁజిక్కిన మకడోనియా సైన్యములపై మాగధసైన్యములు కసిదీర్చుకొనె ననుటకు సందియము లేదు. (క్రీ. పూ. 303)

చంద్రగుప్తుడు శల్యూకసుతో నొడంబడిక చేసికొని, గెడ్రోషియా అరకోషియా అనబడు అప్గానిస్థాను బెలూచిస్థాను దేశముల నూడఁబీకికొనియెను. ఇప్పటి యాంగ్లేయులు పశ్చిమోత్తర సామంత సీమలందు పర్వత రక్షితమై, పరశత్రువుల కభేద్యమై యుండు సరిహద్దులు తమ చేతఁ జిక్కుపడవలెనని యత్నించిరి. మోగలరాజులును యత్నించిరి. కాని వీరి కేరికిని సాధ్యము కాలేదు. ఇట్టి సరిహద్దులు 2200 సంవత్సరములకు మునుపె మనదేశపు చారిత్రక చక్రవర్తియగు చంద్రగుప్తుని యఱచేత నిమిడియుండెనన్న మన కెంతటి యశఃకరము నానందకరముగ నున్నది!

చంద్రగుప్తుఁడు సెల్యూకసును అంతటితో వదలిపెట్ట లేదు. అతని కుమారిత సుందరియు, యువతియు, నిపుణయునై యున్నందునను, తనకు మహిషినష్టమై యున్నందునను, యవను లటుమీఁదట శత్రుత్వము పాటింపకుండునట్లు దగుపాటి వస్తువును విశ్వాస స్థానమం దుంపవలసి యున్నందునను, యాదవ పాండవులయు విరాట పాండవులయు వియ్యంబులు వోలె నా కాలమునందు వియ్యంబు నెయ్యంబునకు ఆధారముగ భావింపబడినందునను, చాణక్య మంత్రాలోచన నంగీకరించి