పుట:Chandragupta-Chakravarti.pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాలుగవ ప్రకరణము

45


శల్యూకస్‌ను జయించుట

అట్లు పంజాబునుండి వెడలఁగొట్టఁబడిన గ్రీకువారికి శల్యూకస్‌నికేటర్ అను రాజుగలఁడు. ఇతఁడు మొదట నలెగ్జాండరు నొద్దనున్న గొప్ప సేనానులలో నొకఁడు . అలెగ్జాండరు కాలధర్మము నొందిన తరువాత సెల్యూకన్ కొన్ని దినముల వఱకు నితర సేనానులతోఁ బోరాడి ఆసియా ఖండములోని పశ్చిమ భాగమునకును మధ్య భాగమునకును రాజై బేబిలోన్ పట్టణమందు క్రీ. పూ. 312 వ సంవత్సరమున పట్టాభిషిక్తుఁ డయ్యెను. అతని రాజ్యము యొక్క తూర్పుసీమ హిందూ దేశము నంటియున్నందున గ్రీకుపతాకమును మఱల పంజాబు దేశములో నిల్పనెంచి దానిపై దాడి వెడలి వచ్చెను. (కీ. పూ. 305 ) అప్పటికి చంద్రగుప్తుఁడు సింహాసనమెక్కి పదునైదు సంవత్సరములయి యుండెను. అతఁడు పంజాబు సింధు దేశములను, గుజరాతు దేశమును జయించి వశపరిచి కొని యుండెను. సెల్యూకసు సింధునది దాఁటుట నడ్డగింపక చాణక్య చంద్రగుప్తులు అత్యంత చాతుర్యముతో అతని సైన్యమునెల్ల తమ సైన్యములతో చుట్టి ముట్టడించుకొని బంధించి వేసిరి.

ఇట్టి యవసరమున సెల్యూకసు యుద్ధముఁజేసి సోలిపోయి శరణాగతుఁ డాయెనని కొందఱును, యుద్ధముసేయుటకు వెఱచి తన దుర్బలము నరసి వీర్యముకంటే వివేకము మేలని నిశ్చయించి చంద్రగుప్తునకు శరణాగతుఁడాయెనని మఱికొంద