పుట:Chandragupta-Chakravarti.pdf/143

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

142

చంద్రగుప్త చక్రవర్తి


నిర్ణీత ఫలప్రాప్తికి వలసిన సర్వోద్యమ పరత్వమును చాణక్యుఁడు వెల్లడిసేయుచున్నాఁడు. ఈ నాటకమునందలి సర్వకార్య వ్యవసాయమును చాణక్యునిదిగనే ద్యోతకపడుచున్నది.

ఇతఁడు “ విఘ్నేర్ముహుర్ముహురపి హన్యమానాః ప్రారబ్ధ ముత్తమగుణా సపరిత్యజన్తి, " 1[1] అను శ్లోకమునకు దృషాంత రూపుఁడన్నను సరిపోదు, విఘ్నముల ఛాయలైనను పొడఁగట్ట నట్టులు భూతభవిష్యద్వర్త మానములను గణితశాస్త్రజ్ఞుల సునిశ్చితతో సమానపఱచి, యుపక్రమించిన యత్నములను పూర్వనిర్ణీత యుపసంహారములకు కొనసాగించుచు ఆయా దేశములలో నా యా కాలములలో అస్ఖలిత జయులై సంచరించిన మహాత్ములలో నొకండు. గ్రీకులలో అలెగ్జాండరు, రోమనులలో సీజరు, ఫినిషియనులలో హానిబలు, యూరోపియనులలో నెపోలియను, అమెరికనులలో వాషింగుటను చరిత్రముల, జదివిన వారల కెట్టి యుత్సాహము పుట్టఁగలదో యట్టియుత్సాహము చాణక్య చంద్రగుప్తుల చరిత్రము జదివినవారికిఁ బుట్టక మానదు. అలక సుందరాదులకైన కొన్ని కొన్ని యపజయములు, చిత్తక్లేశములు కలవు. కాని ఈ చాణక్యునకు, మాత్రమది యేమియు లేదు. " సృషలుని కల్పనాయాసమును నాయొక్క మతి జాగరూకతయు" నని చాణక్యవచనమున

  1. 1 శా.ఆరంభింపరు నీచమానవులు విఘ్నాయాస సంత్రస్తులై
          యారంభించి పరిత్యజింతు రురువిఘ్నాయత్తులై మధ్యముల్
          ధీరుల్ విఘ్నవిహన్యమాను లగుచున్ ధృత్యున్నతోత్సాహులై
          ప్రారబ్దార్థము లుజ్జగింపరుసుమీ ప్రజ్ఞానిధుల్ గావునన్.