పుట:Chandragupta-Chakravarti.pdf/144

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పదియవ ప్రకరణము

143


చదువరులు తడయ గల్గుచున్నది. కాని, సమస్త విషయములును అతఁడు అనాయాసముగనే నిర్వహించు నట్టులు ఒక్క యుదంతము వెనుక మఱియొక్కటి అనాలస్యముగ వచ్చుటం బట్టి కార్య ప్రహమునందు వేవేగముగ అందఱిని లాగికొని పోవునట్లును తోఁచుచున్నది.

ప్రతిజ్ఞాభంగకారి గాఁగల దయా దాక్షిణ్యముల కెడ మియ్యక , అప్రతిగ్రహణ వ్రతంబును మఱపింపఁగల రాజకీయాభిమానాడంబరకాంక్షలఁ గలనైనను తలఁపక, జీర్ల కుడ్యపు పర్ణశాలయందు త్రేతాగ్ని సంరక్షణావిహిత కర్మల పరిపాలించుకొనుచు బ్రహ్మణ వృత్తిపరుఁడై రాజనీతి ధురంధరత యందు తన్నీతియు క్తమార్గము నవలంబించుచు, బ్రాహ్మణ క్షాత్రధర్మముల సమ్మేళన పఱచికొని, చాణక్యుఁడు శాంతాశ్వ ఉగ్రాశ్వములఁ బూన్చిన శకటంబుం ద్రోలు సారధివలెఁ బ్రవర్తించె. “ఇక్కాలమందును బ్రాహ్మణాది జాతిజన్యులు స్వస్వధర్మముల పరిపాలించుకొనుటకు వీలులేక, ఆ ధర్మములు శాస్త్రములయందు మాత్రము సుస్థిరములై నెలకొని యుండఁగ, దినదినానుభవమునందు మిశ్రాచారపరులై యుండఁ జూడమె? నిత్యకర్మానుష్ఠానములు త్రేతాగ్నిహోత్రక్రియలు గ్రామవాసములలో సహితము అంతర్ధానములై నవి గదా ?" యందు రే? మహమ్మదీయ ప్రభుత్వమునందు శ్రుతిస్మృతుల యదార్థానుష్ఠానము లెట్లుండెనో తచ్చరిత్రకారులు చెప్పగలరు. తత్పూర్వమునందున చాణక్యుఁడు ఇప్పటి వారింబలె