పుట:Chandragupta-Chakravarti.pdf/142

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పదియవ ప్రకరణము

141


పంచతంత్రము, కాదంబరి, చణ్డకౌశికము, బృహత్కథ, హితోపదేశము, విక్రమార్కచరిత్రము మున్నగు గ్రంథముల

యుదు సమస్తరాజ నీతిశాస్త్రములకును చాణక్యుఁడు గొప్ప ప్రమాణముగ సంగీకరింపఁబడి యున్నాడు. 1[1] ముద్రారాక్షసమునందు ప్రబలపాత్రముగఁ బ్రజ్వలించుచు, పరిస్ఫుటబుద్దిని, ఆత్మవిశ్వాసమును, యుక్తితంత్రజ్ఞతను, నిరంకుశ నీతిశాస్త్ర ప్రావీణ్యమును, దూరదర్శనమును,

  1. 1. నీతిశాస్త్రము మనదేశమునందు మొట్టమొదట నుత్పన్నమయినది. సంస్కత గ్రంథావళియం దత్యంత ప్రాచీనమయినది. చాణక్యుని నీతిసారము స్వజాతీయశాస్త్రము లన్నిటిలోను అత్యంత బహుజనాదృత మయినది,

    ఇటీవల రెండుమూడు సంవత్సరములక్రిందట మైసూరు రివ్యూనందు మ-రా-రా-శ్రీ. ఆర్. శ్యామశాస్త్రులుగారు. బి. ఎ. చాణక్యకృత అర్థశాస్త్రమునందు ఒక భాగమును ఇంగ్లీషునందు భాషాంతరీకరించుచు వచ్చిరి. ఇయ్యది ప్రాచీన గ్రంథ ప్రతిగా ననేక పండితుంచే నంగీకరింపఁబడి యున్నది. చాణక్య రచిత శాస్త్రములును అందు రూపముగ నతఁడు వడసిన బిరుదులును ఈ దిగువ శ్లోకమునందు గూర్చియున్నవి.

    వాత్సాయ నోమల్లనాగః కౌటిల్యశ్చణకాత్మజః |
    ద్రావిలః వక్షిలస్వామి విష్ణుగుప్త శ్చాంగులశ్చనః ||

    ఇందు వక్షిలనామమున అతఁడు. నైయ్యాయికుఁడనియు, కౌటిల్యు బేర రాజతంత్రజ్ఞుఁడనియు, జ్యోతిశాస్త్రమునందు విష్ణుగుప్తుఁడనియు. కామసూత్రములు యందు వాత్స్యాయనుం డనియు నీతి శాస్త్రమునందు చాణక్యుఁడనియుఁ బ్రసిద్దిఁ గాంచియున్నాడు. మల్లనాగనామము అతని యుద్ధవీరత్వమును. ద్రావిలనామము రణరంగ ప్రాముఖ్యతను ప్రకటించుచున్నవి. అంగుల నామము గణితశాస్త్ర నిపుణతను తెలిపెడిని కాఁబోలు. పాఠాంతరము త్రికాండ శేషమునందు అంసుల అని యున్నందున విశాలభుజుఁడు దృఢగాత్రుఁడని సూచించుచున్నది,