పుట:Chandragupta-Chakravarti.pdf/135

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

134

చంద్రగుప్త చక్రవర్తి


శుల్కాది విరహితంబుగఁ గన్యాదానం బొనర్చుట ప్రాజాపత్యము నాఁబరగు.1[1] ఒకటి లేక రెండు జతల యావులం గొని కన్యనిచ్చుట ఆర్షమనంబడు 2[2] యజ్ఞమున ఋత్విక్కునకుఁ గన్యాదానము సేయుట దైవము3[3] అనంబడియెడి, రజస్వలానంతర వివాహములు సామాన్యములయి యుండినందున నీ నాలుగు విధముల యుద్వాహములయందును కన్యకకు కన్యయొక్క తలిదండ్రులకును వారివారి స్వాతంత్ర్యంబుల నుపయోగించుకొని తమలోఁ దామాలోచించుకొని వధూవరులకు సౌఖ్యావహంబగు విధంబున వివాహములు నడుప వీలుండెను. ఈవివాహము లిట్లు ఆలోచితములయి లోభాదిదుర్గుణవ్యాపార విదూరంబులగుటచేత వీని విషయమున విమోచన విధులు అనావశ్యకము లయ్యెను. తక్కుంగల వివాహము లన్ననో చూడుఁడు,

గాంధర్వము : యియ్యది కన్యాపురుషు లొండొరులను జూచుకొనినంత మాత్రనఁ బెండ్లి చేసికొనుట. 4[4] ఇట్టి వివాహము భ్రమ కాకరంబుగదా. వినికిడి మాటలవలనను ఆకస్మిక దర్శనము వలనను ఒక్కరినొక్కరు ప్రేమించిన నా ప్రేమ కొన్ని సందర్భముల గ్రమక్రమముగ క్షీణించి దాని స్థానమున

  1. 1. "సహోభౌచరతాంధర్మమితి వాచానుభాష్యచ కన్యాప్రదావమభ్యర్బ్యం ప్రాజాపత్యో విధిఃస్మృతః " మనుస్మృతి 3 . 30.
  2. 2. ఆదాయార్షస్తు గోద్వయం — యాజ్ఞవల్క్య 1-58.
  3. 3. యజ్ఞ వ్య ఋత్విజే దైవ:- - - యాజ్ఞవల్క్య 1 - 58
  4. 4. గాంధర్వః సమయాన్మిథ:-- యాజ్ఞవల్క్య. 1.81,