పుట:Chandragupta-Chakravarti.pdf/134

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తొమ్మిదవ ప్రకరణము

133


ననుమతినియ్యవలెను. భర్త భార్యపై విద్వేషము కలవాఁడయినచో భార్యను భిక్షుకుల 1[1] గృహములనో బంధువుల యింటనో పోషకులయింటనో శరణమంద ననుజ్ఞ నీవలెను. పురుషుఁడు తన భార్య పై అన్యాయముగ నేరముమోపి ప్రత్యక్షసాక్షులచేఁ గాని నిర్థారణ కాఁజాలని దుష్కార్యముల నామె కారోపించిన యెడల నతఁడు పండ్రెండు పణములు అపరాధము నిచ్చుకొను చుండెను. భార్య భర్తయందు విద్వేషము కలదైనను అతని యిష్టము లేక వివాహబంధ వినిర్ముక్త కాఁ జాలదు. ఇదే విధముగ భర్తయు భార్య కిష్టములేనిచో వివాహ బంధమును ద్రెంచుకొనఁగూడదు. కాని పరస్పర విద్వేషముండిన యెడల దాంపత్యవిమోచనము కల్పించుకొనవచ్చును. భర్త భార్య వలన అపాయము కలుగుసని భయమంది అభయాతిశయంబుచే విమోచనము గోరుపక్షమున నాయమకు చెందవలసిన సర్వస్వమును నతఁడిచ్చి వేయవలెను. భార్య భర్తవలన అపాయమునకు జడిసి ఆ యపాయమునుండి తప్పించుకొనుటకు విమోచనమును ఆశించినచో నామె యేవిధమగు ధనమునకు గాని ఆస్తికిగాని హక్కుగలదికాదు.

ఈ దాంపత్య విమోచనాచారము మొదటి నాలుగు తెఱంగుల వివాహములకును నిషేధింపఁబడియున్నది. బ్రాహ్మము ప్రాజాపత్యము, ఆర్షము, దైవము అనునియ్యవి ఆ నాలుగు తెఱంగులు. సాలంకార కన్యాదానమునకు బ్రాహ్మమని పేరు.2[2]

  1. 1. వైరాగ్యవంతులగు స్త్రీలు.
  2. 2. బ్రాహ్మోవివాహ ఆహరావదీయతే శ క్త్యలంకృతా (యాజ్ఞవల్క్య1-58)