పుట:Chandamama 1950 01.pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

భగవానుడు మొట్టమొదట ఈ ప్రపంచాన్ని సృష్టించినప్పుడు, ఇప్పుడు మనం చూచే పక్షులూ, చెట్లూ ఈ మోస్తరుగా ఉండేవి కావు. ఆ స్వరూపాలే వేరు.

చెట్లూ చేమలూ సృష్టి ప్రారంభంలో పొడవుగా, మేఘ మండలాన్ని తాకుతూ ఉండేవి. అవి అంత పొడవుగా ఉండడం వల్ల మనుషులూ, జంతువులూ మసలడానికి ఇబ్బందిగా ఉండేది. మరి, మనుషులూ, జంతువులూ అటు యిటు మసలకపోతే తిండి దొరికేది ఎట్లా?

పోతే - చెట్లెక్కి కాయలూ, పండ్లూ కోసుకొందామంటే అవి మేఘ మండలాన్ని తాకుతూ పొడవుగా ఉండటం చేత, అసలే వీలులేకపోయేది. ఆకాశమంత ఎత్తున ఉండే పండ్లు ఎవరు అందుకోగలరు?

ఈ కష్ట సుఖాలన్నీ కనిపెడుతూ వున్న భగవానుడు యోచించి, బ్రహ్మదేవుడికి కబురు పంపించాడు. "బ్రహ్మా ! - ఈ చెట్లు

పొడవుగా ఉండటం చేత, వాటి ఫలాలను కోసుకొని అనుభవించడానికి మనుషులకూ జంతువులకూ వీలు కాకుండా వుంది. కనుక చెట్లలో పండిన ఫలాలను భూమి మీద పడవేయడానికి తగిన సాధనం ఏదైనా నీవు యోచించి వెంటనే సృష్టించవలసింది" అన్నాడు.

అప్పుడు బ్రహ్మదేవుడు భగవానుని ఆజ్ఞ ప్రకారం మొదట ఒక నెమలినీ తరువాత ఒక కొంగనూ సృష్టించాడు.

సృష్టి ప్రారంభంలోనే ఈ రెండు పక్షుల మధ్యని అసూయ బయల్దేరింది. కొంగ సరాసరి భగవానుని వద్దకు వెళ్లి "స్వామీ!- నెమలి ఎంతో చక్కగానూ, సుందరంగానూ ఉన్నదని లోకం అనేక విధాల మెచ్చుకొంటున్నది. లోకులు మెచ్చుకొంటున్న కొద్దీ నెమలి ఉత్సాహపడి, తన అందానికి తనే మురిసిపోతున్నది. నేను చూడబోతే చిన్నదానిలా, భూమికి బెత్తెడు


యస్.మల్లిఖార్జునరావు, భీమవరం