పుట:Chandamama 1950 01.pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఎత్తున పొట్టిగా కనబడుతున్నాను. అందు చేత అన్ను ఎవళ్లూ మెచ్చుకోలేదు సరికదా, నావేపైనా కన్నెత్తి చూడటంలేదు. బ్రహ్మకు నాపైన ద్వేషం, ఇటువంటి పక్షపాత బుద్ధి ఎందుకు కలిగిందో ఏమిటో కనుక్కోండి" అని ప్రార్థించేవరకు, భగవానుడు మళ్ళీ బ్రహ్మను పిలిపించాడు.

"ఏమయ్యా బ్రహ్మా! - నువు సృష్టించిన కొంగ ఇలా గోలపెడుతున్నదేమిటి? నెమలిలాగా దానిని కూడా ఎందుకు అందంగా చేశావు కావు?" అని అడిగాడు

అప్పుడు బ్రహ్మ "స్వామీ! - కొంగకు ఎలా ఇష్టమైతే అలాగే దాని రూపం సవరిస్తాను. ఎప్పుడైతే మాత్రం ఏమి మించిపోయింది?" అంటూ, కొంగను రెండు చెతులలోకి తీసుకొని, ఒక చేతుతో దాని మెడ, రెండవ చేతితో దాని కాళ్ళూ పట్తుకొని బాగా సాగదీయనారంభించాడు. బ్రహ్మ చేసే మరమ్మత్తుకు తట్టుకోలేక, కొంచెం సేపటికే

కొంగ "బాబోయ్! చాలు బాబోయ్!" అని గోల పెట్టింది.

అప్పటినించీ కొంగ కాళ్ళూ, మెడా పొడవై, లోకులందరకూ స్పష్టంగా కనబడేటట్టు తయారుచేయబడింది. తన పొడవాటి మెడ చూచుకొని, నెమిలి కంటే ఎత్తుగా ఉన్నాను గదా అని తృప్తిపడి, కొంగ మురిసిపోయింది. బ్రహ్మచేసిన ఈ మార్పుకి భగవానుడు సంతోషించి, నెమలిని పక్షులకు రాజుగానూ, నెమిలిరాజు కింద కొంగ మంత్రిగానూ ఉండాలని నియమించాడు.

ఆ తరువాత జంటజంటలుగా రకరకాల పక్షులను బ్రహ్మదేవుడు సృష్టించనారంభించాడు. అవన్నీ రెక్కలు టపటపా కొట్టుకుంటూ చెట్లపైకి ఎగిరి, వాటికి ఉండే పండ్లను భూమిమీద పడవేయటానికి ప్రారంభించాయి. అప్పటినించీ, ఏ ఎగిరే పక్షుల సాయం వల్ల మానవులకూ, జంతువులకూ తిండి సమస్య కొంతవరకు తీరింది.