పుట:Chandamama 1947 07.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మాత్రం చిన్నిపుట్టలాగ కనిపించింది. దానితో అతనికళ్ళు తిరిగాయి. గుర్రం జూలు గటిగా పట్టుకొన్నాడు. అది ఆక్కుండా పైకిపోతూవుంది.

ఫిరోజిషాకు పెద్దలు తలుపుకొచ్చారు. అల్లారుముద్దుగా పెంచిన తండ్రి జ్ఞాపకం వచ్చాడు. రోజూ తనతో ఆడుతూ పాడుతూ వుండే చెల్లెలు జ్ఞాపకం వచ్చింది. స్నేహితులు జ్ఞాపకం వచ్చారు. అతనికి భయం మరీ ఎక్కువైంది. కళ్ళు మరీ గట్టిగా మూసుకొన్నాడు. గుర్రం వాయువేగ మనోవేగంతో పోతూనే వుంది.

ఇలా కొంతసేపు పోగాపోగా ఫిరోజిషాకు జడుపు తగ్గింది. గుర్రాన్ని క్రిందికిదించటం ఎలాగా అని ఆలోచించాడు. ఎక్కడో దానికి మరొకమీట ఉండితీరాలను కొన్నాడు. జూలులో వెదికాడు; కనిపించలా. జీనుప్రక్కన ఉన్న చీలలు తిప్పి చూచాడు; లాభం లేకపోయింది. చివరికి విసుగెత్తి దాని రెండు చెవులు పట్టుకొన్నాడు. గుర్రం వేగం తగి మెల్లగా క్రిందికి దిగ సాగింది. అప్పటికి అతని ప్రాణాలు కుదటపడ్డాయి.

గుర్రపుచెవులు రెండు ఇంకా గట్టిగా వెనకకులాగాడు. చర్రున అది కిందికి దిగసాగింది. అలా దిగిదిగి చివరికి ఒక ఏడు అంతస్థుల మేడమీద వాలింది. అప్పటికి బాగా ప్రొద్దుపోయింది. పట్టణ మంతా మాటుమణిగివుంది.

పిరోజిషా మెట్లు దిగి ఏడో అంతస్థు లోపలికి వెళ్ళాడు. అతనికి సంగీతం వినిపించింది.