పుట:Bible Sametalu 3.pdf/2

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

2. తెలుగు, బైబులు సామెతలు: ఉపదేశం

సామెతల ముఖ్య ప్రతిపాదానలు వివిధా రకాలు. కొన్ని నలుగురి గమనంలో ఉన్నిదానిని ఉన్నట్లు చెప్పి ఊరుకుం టాయి. మరికొన్నిటిలో హితబోధ, ఉపదశ కరత లామలకమై సామెత వినగానే చటుక్కున స్పురించే విధంగా ఉంటుంది.'తినడానికి తిండి లేదు గాని తనవారికి తద్దినాలు', లేదా 'అప్పుచేసి పప్పు కూడు'అనగానే ఇక్కట్లలో ఉన్నప్పుడే డాబుసరి పనికిరాదు(సీరా 18:13) అనేహితోపద శం ప్రత్య క్ష మైఆకట్టుకొంటుంది. ఈ కోవకు చెందిన సమానార్ధకమైన తెలుగు, బెబౖ ులు సామెతలను ఈ అధ్యాయంలో పరిశీలిద్దాం. 'క్రియ లు లేని విశ్వాసము వ్యరవ్థ ుని బైబులు చెబుతుంటే'చెప్పు ట కంటేచేయు ట మేలు' అని తెలుగు సామెత సెలవిస్తున్నది. తెలుగు సామెత 'గోడకిచెవులుంటాయి' అని ఊరుకుంటే 'మనస్సులో కూడ రాజును విమర్శించకు ము' అని బైబులు సామెత హితవు పలుకుతున్నది. ఆ విధంగా ఈ వర్గం లో ఉన్నవన్నీ ప్రబోధాత్మక సామెతలు.

1 తెలుగు సామెత :

అందని మాని పండ్లకు ఆశపడకు

బైబులు సామెత :

పరకాంత సొగసుకు బ్రమయ వలదు (సామెతలు 6:25)

తెలుగు సామెతలో అందని మాని పండ్లకు ఆశించడం వ్యర్ధమన్న మాట ఉండగా బైబులు సామెత పరకాం త పొందును ప్రస్తావించి ఈ నీతిని ఉద్దీపిం పజేసింది. అధిక సంఖ్యలో ఋజువర్తనులున్నప్పటికీ అన్యకాంతలను మోహించే కాముకులు ప్రతి సమాజంలోనూ ఉంటూనే ఉంటారు. వేశ్యాగమనం వేరు . వేరొకని భార్యపై చిత్తం నిలిపి మన్మథాగ్నిలో శలభాలౌతూ పథాకాలు రచిస్తూ మనశ్శాంతికి దూరమైపోవడం దుర్జన పద్దతి . వేమన చెబుతున్నది అదే: 167