పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/92

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చింతించనక్కరలేదు, మరలా రాజీపడవచ్ఛ్హు
కాని అవమానం, అహంకారం,
రహస్యాలను బయలుపర్చడం, వెన్నుపోట్ల పొడవడం
అనేవాటిని ఏ మిత్రుడు సహించలేడు
రహస్యాలను వెలిబుచ్చేవాడు నమ్మదగనివాడు
అతనికి ఆప్తమిత్రులు దొరకరు
నీ స్నేహితుణ్ణి ప్రేమించి
విశ్వసనీయుడిగా మెలుగు
అతని రహస్యాలను వెల్లడిచేస్తే
ఇక అతన్ని వదలుకోవలసిందే.
ప్రభువు ఎవనివలన ప్రీతి జెందుతాడో
వానికి శత్రువులుకూడ మిత్రులయ్యేలా చేస్తాడు - సీరా 6, 5-8. 14–16. 9,10. 22.20-22, 16–17 సామె 16,7.

దుష్టునితో స్నేహం పనికిరాదు. కష్టాల్లో అతడు మనలను ఆదరించడు, ఆపదల్లో ఆదుకొనేవాడే నిజమైన మిత్రుడు.

కీలు ముట్టుకుంటే చేతులకు మురికి ఔతుంది
దుష్టులతో స్నేహంచేసేవాడు వారివంటివాడే ఔతాడు
సంపదల్లో మంచి మిత్రుడ్డి గుర్తించలేం
కాని ఆపదల్లో చెడ్డమిత్రుడ్డి గుర్తించవచ్చు
కష్టాల్లో మిత్రులుకూడ మనలను విడిచిపోతారు
కాని సంపదల్లో చెడ్డవారుకూడ మిత్రుల్లా నటిస్తారు
చెడ్డ స్నేహితుణ్ణి ఎప్పడూ నమ్మరాదు
త్రుప్పు లోహాన్నిలాగే అతని దుష్టత్వం
మనలను నాశం చేస్తుంది
కొందరు మనం పచ్చగా వున్నపుడు మిత్రుల్లాగే కన్పిస్తారు
కాని ఆపదలు వచ్చినపుడు మనకు ఎదురుతిరుగుతారు
కాని కొందరు కష్టాల్లో మనలను ఆదుకొంటారు
శత్రువు మనమీదికి వచ్చినపుడు వానితో పోరాడతారు
నీ తరపున పోరాడిన నేస్తుని మరచిపోవద్దు