పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/93

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నీకు సంపదలబ్భీనపుడు అతన్ని విస్మరించకు
కొందరు మిత్రులు మనకు కీడు దెస్తారు
కాని కొందరు సోదరులకంటె యొక్కువగా హితం చేకూరుస్తారు- సీరా 13,1. 12,8-10, 37, 4-6, సామె 18,24

12. వివాహ ధర్మాలు

పురుషునికి పెండ్లి ఆడుతోడూ అవసరం. భార్యభర్తకు సాయం చేస్తుంది.
స్త్రీ సౌందర్యం పురుషునికి ఆనందం కలిగిస్తుంది
నరుని కంటికి అంతకంటె యింపైనది లేదు
భార్యను బడసినవాడు అదృష్ణాన్ని బడసినట్లే
ఆమె అతనికి సాయంజేసి అతన్ని ప్రోత్సహిస్తుంది
కంచెలేని స్థలాన్ని అన్యులు ఆక్రమించుకొంటారు
భార్యలేని పురుషుడు నిటూర్పులతో
ఊళ్ళ వెంట తిరుగుతాడు - సీరా 36, 22–25.

సొంత తెగనుండే పిల్లను దెచ్చుకొని పెండ్లిజేసికొంటే ఒద్దికగా సంసారం గడపవచ్చు. కనుక తోబీతు కుమారునికి ఈలా వుపదేశం చేసాడు. "నాయనా! మన తెగనుండే వొక పిల్లను పెండ్లిజేసికో, మన పూర్వులైన నోవా, అబ్రాహాము, ఈసాకు, యాకోబు మొదలైన వాళ్ళంతా వారి తెగకు చెందిన పిల్లలనే పెండ్లడారు. కనుక దేవుడు వారికి సంతానాన్ని దయచేసాడు” - తోబీ 4,12-14

గుణవతియైన భార్యను బడసినవాడు ధన్యుడు
ఆమె మూలాన అతని ఆయుస్సు రెండురెట్ల పెరుగుతుంది
సద్బుద్ధిగల భార్య భర్తకు పరమానందం కలిగిస్తుంది
అతడు శాంతిసమాధానాలతో జీవితం గడుపుతాడు
మంచి యిల్లాలు శ్రేష్టమైన వరం లాంటిది
దైవభీతి కలవారికేగాని ఆ వరం లభింపదు
యోగ్యురాలైన భార్యవలన భర్త ఆనందం చెందుతాడు
ఆమె సామర్థ్యం వలన అతడు బలాఢ్యుడౌతాడు
మిత భాషిణియైన భార్య దేవుడిచ్చిన వరమనాలి
ఆమె సంయమనానికి వెలకట్టలేం
శీలవతియైన భార్య మనోజ్ఞత అంతింతకాదు