పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/87

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కుమారా! నీవు దేవుని సేవింప గోరితే
పరీక్షకు సిద్ధంగా వుండు
చిత్తశుద్ధితోను పట్టుదలతోను మెలగు
ఆపదలు వచ్చినపుడు నిబ్బరంగా వుండు
ప్రభువుని ఆశ్రయించు, అతన్ని విడనాడకు
అప్పడు నీవు విజయాన్ని పొందుతావు
ప్రభువు దౌష్ట్యాన్ని పూర్తిగా అసహ్యించుకొంటాడు
దైవభీతికల నరుడు చెడ్డను అంగీకరింపడు
భగవంతుడు ఆదిలో నరుని చేసినప్పడు
అతనికి తన నిర్ణయాలను తానే చేసికొనే స్వేచ్చ నిచ్చాడు
నీవు కోరుకొంటే ప్రభువు ఆజ్ఞలు పాటించవచ్చు. అతన్ని అనుసరించాలో లేదో
నిర్ణయించేది నీవే
ప్రభువు నిప్పూ నీళూకూడ నీముందు పెట్టాడు
చేయి చాచి వాటిలో నీ కిష్టం వచ్చింది తీసికో
మృత్యువు జీవంకూడ నరుని ముందున్నాయి
అతడు తాను కోరుకొన్నది తీసికోవచ్చు.
నీ మరణ కాలంలో ప్రభువు నీపట్ల
ఆగ్రహం చూపకుండా వుండేలానూ
నీకు తీర్పుచెప్పేపుడు నీకు విముఖుడుగా
వుండకుండేలానూ జాగ్రత్తపడు
దైవభీతి కలవాళ్ళు జీవాన్ని పొందుతారు
వాళ్లు నమ్మిన దేవుడే వాళ్ళను కాపాడతాడు
దైవభీతి కలవాడు భయపడనక్కరలేదు
ప్రభువుని నమ్మాడుగాన
అతడు పిరికివాడు కానక్కరలేదు
ప్రభువుని నమ్మినవాడధన్యుడు
ఏ దిక్కునుండి సహాయం లభిస్తుందో అతనికితెలుసు
దేవుడు తన్ను ప్రేమించేవాళ్ళని
ఒక కంట కనిపెట్టి వుంటాడు
వారిని తప్పక ఆదుకొని శక్తితో సంరక్షిస్తాడు
వారిని వడగాలి నుండి