పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/86

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అప్పడు ప్రభువు మన్నన పొందుతావు
 గొప్పవారు పేరుప్రసిద్దులు కలవారు చాలమంది వున్నారు
 కాని ప్రభువు వినయాత్మలకు
 తన రహస్యాలు ఎరిగిస్తాడు
ప్రభువు మహా ప్రభావం కలవాడైనా
 వినముల పూజలు అందుకొంటాడు
 వ్యాధి అనే శిక్షకు గురికాకముందే
వినయాన్ని ప్రదర్శించు
 తప్ప చేసినపుడు పశ్చాత్తాపపడు
 ఉరుముకి ముందు మొరపు చూపట్టినట్లే
 వినయవంతుని మంచిపేరు
అతనికి ముందుగా నడుస్తుంది
 దుమ్మూ బూడిదా ఐన నరులు
 ఏమి జూచుకొని గర్వపడాలి?
మనం బ్రతికివుండగానే మన శరీరం కుళ్ళిపోతుంది
నరుడు చచ్చాక అతనికి దక్కేది
 పరుగులు ఈగలు మాత్రమే
మృత్యువు నీకోసం వేచివుండదు
 నీవేనాడు పాతాళానికి పోతావో నీకే తెలియదు
వ్యాధి అనే శిక్షకు గురికాకముందే
 వినయాన్ని ప్రదర్శించు
తప్ప చేసినపుడు పశ్చాత్తాపపడు
 తన తప్పని తా నొప్పకొనేవాడు
 శిక్షను తప్పించుకొంటాడు - సీరా 3,17-20. 18, 21. 32,10. 10,9-11. 14,12. 18,21. 20,3.

9. దైవభక్తి

నరునికి దైవభక్తి వుండాలి. అతడు ప్రభువు పరీక్షకు సిద్ధంగా వుండాలి. స్వేచ్ఛతో దేవుణ్ణి సేవించాలి. దేవభీతి కలవారిని ప్రభువు ఆదుకొంటాడు. అతన్ని కాలుజారి పడనీయడు. దైవబలమే నిజమైన బలం. తల్లిదండ్రులు చిన్ననాటినుండే తమ బిడ్డలకు దైవభీతిని నేర్పాలి.