పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/85

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


8. దేవునికి ఆరాధనలూ కానుకలూ అర్పించాలి

నరుడు దేవుణ్ణి ఆరాధించి కానుకలు అర్పించుకోవాలి. చేసిన మొక్కుబడులు చెల్లించాలి, తనపొలంలో పండిన పంటనుండి తొలిఫలాలూ దశమభాగాలూ సంతోషంగా అర్పించాలి.
దేవునికి భయపడి యాజకులను గౌరవించు
విధ్యుక్తంగా వారి కీయవలసిన కానుకలు ఈయి
ప్రధమ ఫలాలు, పాపపరిహార బల్యర్పణాలు
బలిపశువు జుబ్బ, పవిత్రార్పణలు ఈయి
కుమారా! నీవు నీ స్థితికి తగినట్లుగా భుజించు
 ప్రభువుకి మేలి కానుకలు అర్పించు
దేవునికి మొక్కిన మొక్కులను వెంటనే తీర్చుకో
 చనిపోయే సమయందాకా జాప్యం చేయకు
 మొక్కుబడి చేసేపుడు దాన్ని చెల్లించే వద్దేశముండాలి
దేవుని సహనాన్ని పరీక్షింపకూడదు.
విమలాత్ముడు అర్పించిన బలిని ప్రభువు అంగీకరిస్తాడు
 అతడు దాన్ని విస్మరింపడు
ప్రభువుకి ఉదారంగా కానుకలీయి
 నీ తొలిఫలాలు అర్పించడంలో పిసినారివి కావద్దు
చిరునవ్వుతో నీ కానుకలను అర్పించు
సంతసంతో దశమభాగాలను ఈయి.
 సీరా 7.31 14,11. 18,22-23. 35,7-9. 38.11.

మతం కేవలం కర్మకాండ కాకూడదు. అది హృదయగతమైన మతమై వుండాలి. దానికి వినయం అవసరం. ఈ వినయాన్ని అవర్చుకోవాలంటే నరుడు తన దారిద్ర్యాన్నీ చావనీ స్మరించుకోవాలి. తన తప్పిదాలకు పశ్చాత్తాపపడాలి.

కుమారా! నీవు చేసే పనులన్నిటిలోను
వినయంతో మెలుగు
బహుమతు లిచ్చేవానికంటే గూడ
వినయవర్తనుని ప్రజలు అధికంగా మెచ్చుకొంటారు
నీవు ఎంత అధికుడివో అంత వినయవర్తనుడివి కా