పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పాపంలేకుండా జన్మించింది. పవిత్రురాలు. కన్యగానే బిడ్డను కంది. ఆ గ్రంథం ఓ తావులో "ఓ మిరియం! దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. పవిత్రపరచాడు. ప్రపంచంలోని స్త్రీ లందరికంటెగూడ నిన్ను ధన్యురాలినిగా జేసాడు." అంటుంది - 3,41. కాని కొరాను క్రీస్తుని ఓ ప్రవక్తగానేగాని దేవునిగా అంగీకరింపదు. కనుక మరియనుగూడ దేవమాతగా అంగీకరింపదు. ఇప్పుడు ముస్లిము దైవశాస్త్రజ్ఞల్లో చాలమంది కూడ నిష్టతో బైబులు చదువుతూన్నారు. అసలు ఆత్మశక్తి వల్ల అన్ని మతాలూ సమైక్యమైపోతూన్న రోజులివి. కనుక ఆ తల్లి ముస్లిము సోదరులనుగూడ క్రీస్తు చెంతకు చేర్చాలని ప్రార్థిద్దాం.

13. మరియమాత - శ్రీసభ

దేవుడు ప్రేమమూర్తి. అతడు ముగ్గురు వ్యక్తులతో గూడిన సమాజం. దేవుడు తన ప్రేమను మానవసమాజానికి అందించాలనుకున్నాడు, అందించాడు. కాని నరుడు దేవుని ప్రేమను ధిక్కరించాడు, పాపం కట్టుకున్నాడు. ఐనా భగవంతుడు కరుణతో పాపపు నరజాతిని రక్షింపబూనాడు. కాని నరజాతి రక్షణ నరజాతినుండే రావాలన్న తలంపుతో దేవుడు తన కుమారుడ్డి నరుణ్ణిగా పంపగోరాడు. ఇక ఈ దేవుణ్ణి నరుణ్ణిజేసి మన సమాజంలోనికి తీసికొని రాదగిన తల్లి ఒకర్తె వుండాలి. దేవుడు ఎన్నుకున్న ఆతల్లే మరియ. ఈ యధ్యాయంలో రెండంశాలు విచారిద్దాం. మరియు మంగళగుణాలన్నిటికీ ఆమె మాతృత్వమే ఆధారం. మరియ మంగళగుణాలన్నీ శ్రీసభకూ, అనగా మనకూ, అక్షరాలా వరిసాయి.

1. దైవసంకల్పంలో మరియ

}}

అనాదినుండి దేవుని రక్షణప్రణాళికలో క్రీస్తు ఉన్నాడు. మరియమాతా వుంది. క్రీస్తుదేహం గాబోయే శ్రీసభా వుంది. మరియద్వారాగాని దేవుడు మానవసమాజానికి తన కుమారుణ్ణి ప్రసాదించలేడు. ఆమెద్వారాగాని పరలోకపిత మానవసమాజంతో రక్షణ సంబంధం పెట్టుకోలేడు. సరే, భగవంతుని కోరిక ప్రకారం మరియ దేవుని కుమారుణ్ణి నరుణ్ణిజేసి మన మంటిమీదికి ప్రవేశపెట్టింది. ఈ మహత్తర కార్యంద్వారా ఆమె దేవమాత ఐంది. మరియ గుణాలన్నిటిలో శ్రేషాతిశ్రేష్టమైంది ఈ దైవ మాతృత్వమే. ఆమె గొప్పతనమంతా ఈ లక్షణంమీదనే ఆధారపడివుంది.

ఈ మరియు రక్షిత మానవ సమాజంలో మొదటి వ్యక్తి రక్షిత మానవసమాజమే శ్రీసభ, క్రీస్తుదేహం. కనుక శ్రీసభకు మరియ ఆదర్శంగా వుంటుంది. పూర్వాధ్యాయాల్లో కన్యాత్వం, నిష్కళంకత్వం మొదలైన మరియ భాగ్యగుణాలను వివరించాం. ఈ