పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆర్థించి పెట్టాడు. ఇక రక్షణ ఫలితమైన వరప్రసాదాలను ఆర్థించడంలో క్రీస్తుకు తోడ్పడిన మరియ, ఆ వరప్రసాదాలను పంచిపెట్టడంలో గూడ తోడ్పడుతుంది. రక్షణంలో ఆమె తోడ్పాటు అవసరమై కాదు. ఔచిత్యంకోసం అన్నాం. వర ప్రసాదాలను పంచిపెట్టడంలోగూడ ఆమె తోడ్పాటు అవసరమై కాదు, ఔచిత్యంకోసం మాత్రమే.

పునీతులు మనకు ఏదో వో ప్రత్యేక వరప్రసాదాన్ని ఆర్థించి పెట్టగలరు. కాని అన్నివరప్రసాదాలను ఆర్థించి పెట్టలేరు. మరియ మనకు ఏ వరప్రసాదానాన్నై సంపాదించి పెట్టగలదు. అన్ని వర ప్రసాదాలూ ఆమెద్వారానే గాని లభించవు. కనుక పునీతులుకూడ ఆమె ద్వారాగాని మనకు ఆయా వరప్రసాదాలను ఆర్థించిపెట్టలేరు. వేయేల, క్రీస్తు వరప్రసాదం మరియ చేతులమీదుగాగాని నరులను చేరదు.

మన అక్కరలు ఆ తల్లికి బాగా తెలుసు. ఆమెకు మనకు సహాయం చేయాలనే కోరికా వుంది, శక్తి వుంది. అంచేత మన తరఫున మనవి చేసితీరుతుంది. ఈ మనవి కూడ మన రక్షణానికి వ్యతిరేకంగా వుండదు. అంచేత ప్రభువు ఆమెకోరికను తప్పక తీరుస్తాడు. వెంటనే తీరుస్తాడు కూడ.

మంచితల్లి బాధ్యత బిడ్డలను కనడంతోనే తీరిపోతుందా? తాను ఆ బిడ్డలను పోషించాలిగదా? తొలియేవ మనలను మరణానికి కంటే యీ రెండవయేవ జీవనానికి కంది. అనగా మరియ మనలను జ్ఞానజీవితానికి ప్రసవించింది. ఈలా ఫుట్టిన బిడ్డలమైన మనలను ఆ తల్లి తన వరప్రసాదాలతో పోషిస్తుంది. కావున ఆ తల్లిమీద మనకు ఎంతైనా నమ్మకముండాలి. బిడ్డ తల్లి పట్లలాగ, పనికత్తె యజమానురాలి పట్లలాగ, మనమూ మరియమాతపట్ల నమ్మికతో జీవిస్తుండాలి. మన అయోగ్యతను ఆమె యోగ్యత పూరిస్తుంది. మన అశక్తతను ఆమెశక్తి సవరిస్తుంది. కనుక మన అక్కరలన్నీ ఆ తల్లిద్వారా దేవునికి విన్నవించుకోవాలి.

వేదశాస్త్రజ్ఞలు మరియమాత మనకు ఎలా వరప్రసాదాలూ ఆర్థించి పెడుతుంది అని ప్రశ్నించుకొని చాల ఉపమానాలు చెప్పారు. 12వ శతాబ్దపు భక్తుడు క్షేర్వో బెర్నారు ఆమెను ఓ కాలువతో పోల్చాడు. దూరప్రాంతంలోని చెరువు లేక ఆనకట్టయందలి నీళ్ళ కాలువద్వారా మన వూరి పొలందాకా వస్తాయి. క్రీస్తు ఓ వరప్రసాదాల చెరువు. ఆ చెరువునుండి వరప్రసాదాలనే జలాలు మరియమాత అనే కాలువద్వారా మన హృదయంల్లోకి ప్రవహిస్తాయి.

ఇంకా కొందరు మరియను ఓ నిచ్చెనతో ఉపమించారు. నిచ్చెనగుండా యింటిమీదికో, చెట్టమీదికో ఎక్కిపోతాం. క్రిందికి దిగివస్తాం, మరియమాత అనే నిచ్చెన గుండా దేవుడు మన మంటిమీదికి దిగివచ్చాడు. మరియ అనే నిచ్చెనను వాడుకొని