పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/261

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చావక తప్పదు. మనం అక్కడి వాళ్ళమే కాని యిక్కడి వాళ్ళం కాదు. కనుకనే తాత్వికులు యద్దృశ్యం తన్నశ్యం - అనగా కంటికి కన్పించేదల్లా నశించేదే అని వాకొన్నారు.

2. ఆ గడియను దేవుడే నిర్ణయిస్తాడు

            మనం ఎప్పడు మరణిస్తామో, ఏలా మరణిస్తామో, మనకు తెలియదు. మనమరణాకాలాన్ని మనం నిర్ణయించం. దేవుడే ఆ గడియను నిర్ణయిస్తాడు. కొద్దిమంది విషయంలో మాత్రం చావు ఎప్పుడు వస్తుందో ఊహించవచ్చు. కాని చాలమంది అలాంటి వూహకు తావులేకుండానే తలవని తలంపుగానే దాటిపోతారు. 
          మృత్యువకీ జీవానికీ అధిపతులం మనంగాదు, దేవుడు, సొలోమోను జ్ఞానగ్రంథం భగవంతుణ్ణి ఉద్దేశించి 

జీవంమీదా మరణంమీదా నీ కధికార ముంది
నీవు నరుణ్ణీ మృత్యుద్వారం చెంతకు గొనిపోతావు
అక్కడినుండి మరల వెనుకకు తీసుకొని వస్తావు

అని చెప్తుంది – 16,13. అలాగే ద్వితియోపదేశ కాండంగూడ

నేను తప్పక మరో దేవుడు లేడు
జీవానికీ మరణానికీ కర్తను నేనే
గాయపరచేది నయంచేసేది కూడ నేనే
నా కెవరూ అడ్డు రాలేరు

అని వాకొంటుంది - 32,39. ప్రభువు మనుష్యకుమారుడు దొంగలా వస్తాడని చెప్పాడులూకా 12,39-40 దొంగ ఎప్పడొస్తాడో మనకు తెలియదు. అలాగే మరణం ఎప్పుడు వస్తుందో గూడ మన మూహించలేం.

మన బ్రతుకుని దేవుని వద్ద నుండి ఎరువు తెచ్చుకొన్నాం. కనుక మన ప్రాణానికి మనం కర్తలం కాదు. దేవుడు ఊపిరిపోస్తాడు, ఊపిరి తీస్తాడు కూడ. మనతరపున మనం దేవుడు మనకు దయచేసిన ఈ జీవితాన్ని సద్వినియోగం చేసికోవాలి. ఈ లోకంలో సత్కార్యాలు చేయాలి. ఈ మంటిమీద నిరర్థకంగా రోజులు వెళ్ళబుచ్చగూడదు. ఇంకా, దేవుడు మనలను పిల్చిందాకా ఈ నేలమీద మన ప్రాణాన్ని పదిలంగా కాపాడుకోవాలి. మన ప్రాణాన్ని తీసుకొనె హక్కు అనగా ఆత్మహత్యకు పాల్పడే అధికారం, మనకు లేదు.

కొంతమంది మేమెప్పుడు ఏలా చనిపోతామో అని భయపడుతూంటారు. మనకు ప్రాణమిచ్చిన తండ్రి క్రూరుడు కాదు, దయామయుడు. దయామయుడు కనుకనే అతడు మనలను పట్టించాడు. మనలను తీసికొని పోయేపుడుగూడ అతడు క్రూరుడుగా గాక దయాపరుడూనే మెలుగుతాడు. కనుక మనం ప్రభుని నమ్మాలి, మనం ఎప్పడు చనిపోతామో ఏలాంటి పరిస్థితుల్లో చనిపోతామో మనకు ముందుగా తెలియకపోయినా 253