పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/229

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

9.నా వద్ద వెండిబంగారములు లేవు అన్నది యెవరు?
10. దేవుని సహకారము లేనియెడల నీవు చేయుచున్న అద్భుతకార్యములను ఎవడును చేయలేదు అని క్రీస్తుతో అన్నది ఎవరు?

27. క్రీస్తు శ్రమలు

1.క్రీస్తు దేనిపై నెక్కియెరూషలేము ప్రవేశించెను?
 2.యేసు కానుకల పెట్టెవద్ద కూర్చుండి ఎవరిని మెచ్చుకొనెను?
 3.క్రీస్తు కడపటివిందు భుజించిన పిమ్మట ప్రార్థన చేయుటకు ఎక్కడికి పోయెను?
 4.యూదా క్రీస్తుని ఎన్ని వెండికాసులకు పట్టియిచ్చెను?
 5.సిలువను మోయుటలో క్రీస్తుకి సాయపడిన నరుడెవరు?
 6.క్రీస్తు తన్ను సిలువ వేయువారికొరకు ఏమని ప్రార్థించెను?
 7.సిలువపై క్రీస్తు దేనిని త్రాగుటకు నిరాకరించెను?
 8.క్రీస్తు సిలువపై ఏమి వ్రాసిపెట్టిరి?
 9.క్రీస్తు దేహమును ఇప్పింపుమని పిలాతుని అడిగినదెవరు?
 10.యేసు భౌతికదేహమును ఎచట పాతిపెట్టిరి?

28. మత్తయి సువిశేష వాక్యాలు - 1

ఈ క్రింది వాక్యాలలోని ఖాళీలను పూరింపుడు

l.మానవుడు కేవలము రొట్టెవలననే జీవింపడు. దేవుడు వచించు - - - - జీవించును.
2.హృదయ పరివర్తనము చెందుడు - - - - సమీపించియున్నది.
3. మీరు నన్ను అనుసరింపడు. నేను మిమ్ము - - - - చేయుదును.
4.కామేచ్చతో పరస్త్రీని పరికించు ప్రతివ్యక్తి ఆమెతో - - - - వ్యభిచరించినట్లే,
5.నీ సంపదలున్న చోటనే నీ - - - - ఉండును.
6.ఏ నరుడును ఇద్దరు - - - - సేవింపజాలడు. కనుక నీవు ఎన్నడును దైవమును - - - - సేవింపజాలవు.
7.పరులనుగూర్చి మీరు తీర్పు చేయకుడు. అప్పడు మిమ్ముగూర్చియు - - --
8.ఇతరులు మీకేమి చేయవలెనని కోరుకొందురో దానిని మీరు . . . .
9.నా బోధలు ఆలించి పాటించని ప్రతివాడు . . . . ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియున్నాడు.
10. మీ తలవెండ్రుకలన్నియు . . . . కావున భయపడకుడు.