పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/230

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

29. మత్తయి సువిశేష వాక్యాలు - 2

ఈ క్రింది వాక్యాలలోని ఖాళీలను పూరింపుడు

1.నీవు పేత్రువు. ఈ రాతి మీద . . . . నిర్మింతును.
2. నన్ను అనుసరింప గోరువాడు . . . . సిలువను తీసికొని నన్ను అనుసరింపవలెను.
3. మానవుడు లోకమంతటిని సంపాదించినను . . . . వానికి ప్రయోజనమేమి?
4.ఎక్కడ ఇద్దరు ముగ్గురు నాపేరిట . . . .
5. నీ అనుమతి యైనచో నేను నీకు, మోషేకు, ఏలియాకు మూడు . . . .
నిర్మింతును.
6. మీరు చిన్నబిడ్డవలె రూపొందిననే తప్ప . . . . ప్రవేశింప జాలరు.
7. దేవుడు జతపరచిన జంటను . . . . వేరు పరుపరాదు.
8.- - - . నా యొద్దకు రానిండు. అట్టి వారిదే పరలోక రాజ్యము.
9. మానవులకు ఇది అసాధ్యము. కాని దేవునికి సమస్తము . . . .
10.భూమి ఆకాశము గతించి పోవునుగాని . . . . గతించిపోవు.

30. మత్తయి సువిశేషము 1-7

1.ఇమ్మానువేలు అనగానేమి?
2. క్రీస్తు జన్మించినపుడు యూదయా రాజెవరు?
3. క్రీస్తుకి నజరేయుడు అను పేరు ఎట్లు వచ్చెను?
4. అతడు ఎడారిలో ఎంతకాలముండెను?
5. ఎడారిలో పిశాచ శోధనలు ముగిసిన పిదప క్రీస్తుకి ఎవరు సేవలు చేసిరి?
6. క్రీస్తుకి మొదట ఏ యిద్దరు శిష్యులైరి?
7.నీ శత్రువుని ద్వేషింపుము అని పూర్వవేదము బోధించెను. దీనికి బదులుగా క్రీస్తు బోధించిన దేమిటి?
8. క్రీస్తు శిష్యులకు నేర్పిన ప్రార్థనలో మొదటి మాటలు ఏవి?
9. లిల్లీ పుష్పమువలె సుందరములైన వస్త్రములు తాల్చలేని పూర్వవేద రాజు ఎవరు?
10. నరులు ఇద్దరు యజమానులను సేవింపలేరు. ఆ యిద్దరు ఎవరు?