పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/228

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

25.క్రీస్తు సామెతలు

ఈ క్రింది వాక్యములు ఏ సామెతల లోనివి?
1.మీరు పనిపాటలులేక దినమంతయు ఇచట నిలచియున్నారేమి?
2."నా పొరుగువాడెవడు?" అని అడిగిన వేదశాస్త్రి ప్రశ్నకు సమాధానముగా క్రీస్తు చెప్పిన సామెత యేది? 3.ఓరీ అవివేకి! ఈ రాత్రికే నీ ప్రాణములు తీసివేయబడును. అపుడు నీవు కూడబెట్టినది ఎవరికి చెందను? 4.నేను దేవునికి భయపడను, మానవులకు గౌరవింపను.
5.అవి తమకై శ్రమపడుటలేదు, వస్త్రములను సంసిద్ధపరచు కొనుటలేదు – ఏవి?
6.ఇది శత్రువు చేసిన పని - ఏది?
7.రొమ్ము బాదుకొనుచు దేవా ఈ పాపాత్ముని కనికరింపుము అని ప్రార్థించెను - ఎవరు?
8.మన మధ్య దాటుటకు వీలులేని అగాధమున్నది - ఎవరెవరికి మధ్య?
9.నీవు ఉత్తముడవు నమ్మిన బంటువు. స్వల్ప విషయములందు శ్రద్ధవహించితివి. కనుక అనేక విషయములను నీకు అప్పగింతును.
10.హృదయపరివర్తనము అవసరములేని తొంబది తొమ్మిదిమంది నీతిమంతులకంటె, హృదయ పరివర్తనము పొందు ఒక పాపాత్ముని విషయమై పరలోకమున ఎక్కువ ఆనందము కలుగును.

26. క్రీస్తు అద్భుతాలు

1.క్రీస్తుని కలసికొనుటకై నీటిమీద నడవబోయిన శిష్యుడెవరు?
2."ఎప్పతా" అనగా నేమి?
3.మిగిలిన తొమ్మిదిమంది యేరీ - ఈ వాక్యము ఏ అద్భుతములోనిది?
4.క్రీస్తు "నా గడియ ఇంకను రాలేదు" అన్నది ఏ యద్భుతమును చేయకముందు?
5.యిస్రాయేలు ప్రజలలోకూడ నేనింతటి విశ్వాసమును చూడలేదు అని క్రీస్తు ఎవరిని గూర్చి పలికెను? 6.ఈయనకు గాలియు సముద్రమును లోపడుచున్నవి కదా? - ఇది యే యద్భుతములోని వాక్యము? 7.బిడ్డల రొట్టెను కుక్కలకు వేయతగదు అని క్రీస్తు ఎవరితో అనెను?
8.క్రీస్తు శపించిన చెట్టు ఏది?