పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/227

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

3.మరియు తొలిచూలు కుమారుని కని ఎక్కడ పరుండబెట్టెను?
4.క్రీస్తు శిశువుని సందర్శింప వచ్చినవారిలో మొదటివారెవరు?
5.యేసు అను పేరునకు అర్థమేమి?
6.ప్రభూ! నీ మాట ప్రకారము ఈ దాసుని ఇక సమాధానముతో వెళ్ళిపోనిమ్మ అని పల్కిన దెవరు?
7.దేవాలయమున క్రీస్తు శిశువును చూచిన ప్రవక్త్రి ఎవరు?
8.తూర్పుదేశపు జ్ఞానులు ఏ గురుతుచూచి బేల్లెహేమునకు వచ్చిరి?
9.వారు ఆ శిశువునకు సమర్పించిన బహుమతు లేవి?
10.మరియా యోసేపులు బాలయేసుతో ఏ దేశమునకు పారిపోయిరి?

24. క్రీస్తు మేలు చేసిన వ్యక్తులు

1.క్రీస్తు ఈమె చేతిని తాకగానే ఈమె జ్వరము పోయెను. ఈమె ఎవరు?
2.మీరు తమ పడవ సముద్రములో మునిగిపోవునని భయపడిరి. కాని క్రీస్తు వీరిని రక్షించెను. వీరెవరు? 3.నల్గురు స్నేహితులు ఇతనిని మోసికొనివచ్చి ఇంటి కప్పగుండ క్రీస్తు చెంతకు జారవిడిచిరి. ఇతడు ఎవడు? 4.ఈ రోగపీడితురాలు క్రీస్తు అంగీని తాకినంతనే ఆరోగ్యము పొందినది. ఈమె ఎవరు?
5.సుంకపు మెట్టకడ కూర్చొనియుండగా క్రీస్తు ఇతనిని పిల్చెను. ఇతడు ఎవడు?
6.ఈ గ్రుడ్డివాడు త్రోవప్రక్కన కూర్చుండి భిక్ష మడుగుకొనుచుండగా క్రీస్తు ఇతనికి దృష్టి ప్రసాదించెను. ఇతడు ఎవడు?
7.క్రీస్తును చూచుటకు మేడిచెట్టును ఎక్కినవా డెవడు?
8.ఈమె తల్లి ఈమె తరపున క్రీస్తుకు మనవిచేయగా అతడు ఈమెకు పట్టిన దయ్యమును వెళ్ళగొట్టెను, ఈమె ఎవరు?
9.యేసూ! నీవు నీ రాజ్యములో ప్రవేశించినపుడు నన్ను జ్ఞాపకముంచుకొనుము అని పల్కిన దెవడు? 10.అవిశ్వాసివికాక విశ్వాసివై యుండుమని క్రీస్తు ఎవరిని మందలించెను?