పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/221

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

10. బైబుల్లోని దుర్మార్గులు

1.దూరదేశమునకు బోయి తన ధనమంతయు భోగవిలాసములతో దుర్వినియోగము చేసినదెవరు?
2.క్రీస్తు ఎవరికి నక్క అని పేరు పెట్టెను?
3.పేత్రుని మోసము చేయబోయి అతని శాపమువలన ప్రాణములు కోల్పోయినవాడెవడు?
4.అన్నకు దక్కవలసిన జ్యేష్టభాగమును అపహరించిన తమ్ముడెవరు?
5.బలాఢ్యుడైన భర్త తలవెండ్రుకలను గొరిగించి అతనిని శత్రువుల చేతికి అప్పగించిన స్త్రీ ఎవరు?
6.మొర్దకయిని ఉరితీయించబోయి తానే ఉరికంబము ఎక్కినవాడెవడు?
7.నాబోతును చంపించి అతని ద్రాక్షతోటను స్వాధీనము చేసికొనిన రాజెవరు?
8.కుక్కలు ఈ దుష్టురాలి శవమును పీకుకొని తిన్నవి. ఈమె ఎవరు?
9.ఒకజాతి అంతయు నాశమగుటకంటె ఒక వ్యక్తి ఆ జాతికొరకు మరణించుట శ్రేయస్కరమని సలహా యిచ్చిన దెవరు?
10.ఎఫెసు పట్టణమున పౌలుపై గలాటా లేవదీసిన కమసాలి ఎవరు?

11. బైబులు నగరాలు

ఈ క్రింది నగరాల పేర్లను పేర్కొనుడు.

1. ఈ నగరమున క్రీస్తుని పర్వతముమీదినుండి క్రిందికి త్రోయబోయిరి.
2. ఈ నగరములో "తెలియని దేవునికి” గూడ ఒక బలిపీఠ ముండెడిది.
3. అబ్రాహాము ఈ రెండు పట్టణాల కొరకు విజ్ఞాపన చేసెను.
4. దావీదు ఈ నగరమును యొబూసీయులనుండి జయించి తన రాజధానిగా చేసికొనెను
5.ఒక ప్రవక్త ఈ నగరము నాశము కావలెనని కోరుకొనెను. కాని దేవుడు దీనిని రక్షించెను
6.ఈ నగరములో క్రీస్తు శిష్యులను మొట్టమొదటిసారిగా "క్రైస్తవులు" అని పిల్చిరి.
7.ఇది పౌలు సొంతవూరు.
8.ఈ నగరమునకు పోవుదారిలో పౌలు పరివర్తనము చెందెను.
9.ఈ గ్రామమున చనిపోయిన విధవ కుమారుని క్రీస్తు జీవముతో లేపెను.
10.క్రీస్తు ఉత్థానముకాగానే ఇద్దరు శిష్యులు యెరూషలేమునుండి ఈ గ్రామమునకు పయనమైపోయిరి