పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/177

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

3, 11,6-17 వచనాల్లో దావీదు వూరియామీద కుట్రలు పన్నాడు. ఎన్నో వంచనలకు పాల్పడ్డాడు. అబద్దాలు ఆడాడు. మోసాలు చేసాడు. వ్యభిచార పాపంలో చిక్కుకొన్నవాళ్ళు నేడూ ఈలాగే కపటంగా ప్రవర్తిస్తారు. వాళ్ళను నమ్మకూడదు.

4. నాతాను కథ వినగానే దావీదుకి కోపంవచ్చింది. అతడు పేదవాని గొర్రెపిల్లను అపహరించిన దుర్మార్గుడు నాలువంతులు నష్టపరిహారం చేయాలి అని అరచాడు, అతనికి ఇతరుని తప్ప బాగా తెలియవచ్చింది. తన తప్ప మాత్రం తెలియలేదు, మనమూ ఇతరుల తప్పలను తీవ్రంగా ఖండిస్తాం. మన పాపాలను మాత్రం గుర్తించం. కాని యెదుటివాని కంటిలోని నలుసును గమనించి మన కంటిలోని దూలాన్ని చూడకుండావుంటే యేమి లాభం? - మత్త 7,3-5.

5. నాతాను మందలించగానే దావీదు తన తప్పని వొప్పకొన్నాడు. నేను ప్రభువుకి ద్రోహంగా పాపంచేసాను అని అంగీకరించాడు. ఇది మంచివాళ్ళ లక్షణం. దుర్మార్గులు తమ తప్పని తాము ఒప్పకోరు. హేబెలుని చంపిన కయీను తన అపరాధాన్ని అంగీకరించలేదు. దేవుడు నీ తమ్ముడు ఎక్కడున్నాడని ప్రశ్నింపగా అతడు వాడికి నేనేమైనా కాపలా వున్నానా అని అడిగాడు - ఆది 4,9. పాపం చేసినపుడు మనం దావీదులా ప్రవర్తించాలిగాని కయీనులా ప్రవర్తించకూడదు.

పాపం కట్టుకోకూడదు. కాని బలహీనతవల్ల పాపంలో పడిపోయినపుడు ఈ దావీదు కథ మనకు పాఠం నేర్పుతుంది. ప్రేరణం పుట్టిస్తుంది. విశేషంగా పాపుల కొరకే దీన్ని బైబుల్లో చేర్చారు.

9. సాలోమోను స్వప్నం

1రాజు 3,4-27

1. సందర్భం

దావీదు చివరిరోజుల్లో అతని కుటుంబంలో అంతఃకలహాలు పెచ్చుపెరిగాయి. అతని కుమారుల్లో ఎవరు రాజు కావాలనే సమస్య ఎదురైంది. పెద్దవాడైన అదోనియా తాను రాజు కావాలని పట్టుపట్టాడు. సైన్యాధిపతియైన యోవాబు అతన్ని సమర్ధించాడు. కాని ప్రవక్తనాతాను యాజకుడైన సాదోకు చిన్నవాడైన సాలోమోనుని రాజుని చేయగోరారు. కడన దైవచిత్త ప్రకారం దావీదు గీహోను చెలమచెంత సాలోమోనుకే రాజ్యాభిషేకం చేయించాడు. తండ్రి అనంతరం అతడు రాజ్యం చేయడం మొదలుపెట్టాడు.