పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/178

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

2. వివరణం

సొలోమోను గిబ్యోను పుణ్యక్షేత్రానికి వెళ్ళి దహనబలులు అర్పిస్తుండేవాడు. ఓసారి అతడు అక్కడ బలిని అర్పించడానికి వెళ్ళగా దేవుడు రాత్రి కలలో కన్పించి నీకేమి వరం కావాలో కోరుకొమ్మన్నాడు. సాలోమోను ప్రభూ! నీవు మా తండ్రి దావీదుని కరుణతో ఆదరించావు. అతడు తన తరపున తాను నిన్ను పూర్ణహృదయంతో సేవించాడు. అతని కుమారుడనైన నేను ఒడుదుడుకులన్నీ తప్పించుకొని ఇప్పడు రాజునయ్యాను. నీవు ఈనాడు నన్ను సింహాసనంమీద కూర్చోబెట్టావనగా మా తండ్రి దావీదుని కరుణించినట్లే, కాని నేను ప్రాయంలో చిన్నవాడ్డి మా తండ్రి దావీదు అనుభవం నాకు లేదు. ఈ ప్రజలు అసంఖ్యాకంగా వ్యాపించి వున్నవాళ్ళు. వీళ్ళను పరిపాలించే సామర్థ్యం నాకులేదు. కనుక వీరిని చక్కగా పాలించడానికి నాకు వివేకవిజ్ఞానాలను ప్రసాదించు అని వేడుకొన్నాడు.

ఆ రోజుల్లో రాజు న్యాయాధిపతిగూడ. ప్రజలు తగాదాలతో రాజు దగ్గరికి వస్తారు. అతడు న్యాయబుద్ధితో తీర్పు చెప్పాలి. ధర్మశాస్త్రంలోని ఆదేశాల ప్రకారం దోషిని శిక్షించి నిర్దోషిని వదలిపెట్టాలి. కనుక సొలోమోను న్యాయాధిపతిగా సక్రమమైన పద్ధతిలో ప్రజలకు తీర్పుచెప్పే వివేకాన్ని ప్రసాదించమని దేవుణ్ణి అడుగుకొన్నాడు, న్యాయాధిపతిగా తన బాధ్యతను తాను నిర్వహించే తెలివిని ప్రసాదించమని దేవుణ్ణి వేడుకొన్నాడు.

మామూలుగా పూర్వవేద ప్రజలు దేవుణ్ణి నాల్లవరాలు కోరుకొన్నారు. అవి దీర్గాయువు, సంతానం, సిరిసంపదలు, శత్రువుల మీద విజయం. కాని సొలోమోను ఈ వర్గాల్లో దేనినీ అడుగుకోలేదు. తన కొరకు ఏమీ అడగలేదు. ప్రజలందరి శ్రేయస్సుకోరి చక్కగా తీర్పుచెప్పే వివేకాన్ని మాత్రం అడుగుకొన్నాడు. మంచి తీర్పులు చెప్పడం అతని బాధ్యత. కనుక అతడు తన బాధ్యతను తాను నిర్వర్తిస్తే చాలు అనుకొన్నాడు.

సాలోమోను మనవి ప్రభువుకి ఎంతో ప్రీతి కలిగించింది. అతడు నీవు నీ స్వార్థాణానికి ఏమీ కోరుకోక ప్రజలను న్యాయబుద్ధితో పరిపాలించే వివేకవరం మాత్రం అడిగావు. తప్పక ప్రసాదిస్తాను. వివేకరంగంలో నీలాంటివాడు నభూతో నభవిష్యతి. నీవడగకున్నా సిరిసంపదలూ కీర్తి ప్రతిష్టలుకూడ నీకిస్తున్నాను. నీ తండ్రి దావీదులాగ నీవు నా యాజ్ఞలు పాటిస్తూ నాకు నమ్మినబంటువై వుంటే నేను నీకు దీర్గాయువుగూడ ప్రసాదిస్తాను అని చెప్పాడు.

అంతట సాలోమోను నిద్ర మేల్కొని దేవుణ్ణి సేవించి యెరూషలేముకి తిరిగివచ్చాడు. అంతకుముందే దావీదు మందసాన్ని యెరూషలేమన గుడారంలో పెట్టించాడు. సొలోమోను దానిముందు దహనబలులు అర్పించాడు. కొలువుకాళ్ళకు విందుజేయించి ప్రభువు తనకు కలలో కన్పించిన వైనాన్ని తెలియజేసాడు.