పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గుణాన్ని ప్రసాదించే దివ్యశక్తి, ఆ దివ్యాత్ముడే రెండవ దైవవ్యక్తియైన వార్తను మరియతో ఐక్యపరుస్తాడు. ఆ దివ్యశక్తి వలననే మరియ గర్భవతి ఔతుంది . ఈ శక్తి శారీరకమైంది కాదు. పరిశుద్దాత్మ మరియకు భర్తాకాదు. క్రీస్తుకు తండ్రీకాదు. అసలు పరిశుద్దాత్మకేవలం ఆత్మస్వరూపం. కనుక మరియమీద పనిచేసింది భౌతికశక్తిగాదు. ఆధ్యాత్మిక శక్తి ఈ ఆధ్యాత్మిక శక్తినే బైబులు చాలాతావుల్లో "అభిషేకం" అని పిలుస్తుంది. ఆత్మ మరియను అభిషేకించింది. అనగా ఆమెయందు ఆంతరంగికంగా, ఆధ్యాత్మికంగా చైతన్యం కలిగించింది. కలిగించి ఆమె స్వయంగానే బిడ్డను కనే శక్తిని ప్రసాదించింది. ఈ అభిషేకం వలననే క్రీస్తుకూడ శక్తిని పొంది మెస్సీయాగా దేవుని ప్రతినిధిగా బహిరంగ జీవితం ప్రారంభించాడు - లూకా 4,18. ఈ అభిషేకం వలననే మనంకూడ జ్ఞానస్నాన సమయంలో ఆధ్యాత్మిక శక్తినిపొంది దేవుని బిడ్డలమౌతాం. 1యేూ 2,27. మరియకూడ ఈలాంటి అభిషేకం వలననే గర్భవతి ఐంది. నూత్నవేద ప్రజల్లో మొదట పరిశుద్దాత్మను పొందిన వ్యక్తి మరియమాత. ఈ యాత్మ శక్తి వలననే ఆమె నరుడ్డి దేవునితో, దేవుణ్ణి నరునితో జోడింప గలిగింది. దేవుణ్ణి నరుడ్డిచేసి నరుణ్ణి దేవుణ్ణి చేయగలిగింది.

3. మరియ కన్యగా ఉండిపోవటానికి కారణాలు

మరియ నిత్యకన్యగా ఉండిపోయిందన్నాం. ఎందుకు? ఆమె దేవునికి తల్లిగా ఎన్నుకోబడింది. కనుక తాను పూర్తిగా దేవునికే చెందివుండాలి. పూర్తిగా దైవసేవకే అంకితంకావాలి. తాను అన్యులకు చెందిపోగూడదు. పౌలు "వివాహిత భర్తనేలా సంతోషపెట్టాలా అని) రేయింబవళ్ళ భర్తృసంబంధ విషయాలతో సతమతమౌతూంటుంది, కాని ప్రభువునకు సమర్పితమైన కన్య ప్రభువునేలా సంతోషపెట్టాలా అని ఆందోళన పడుతూ దేహంనందూ ఆత్మయందూ విశుద్ధరాలై వుంటుంది" అంటాడు - 1 కొ 7, 34. కనుక మరియ కన్యగా వుండిపోయింది పూర్తిగా దేవునికి చెందివుండడము కోసమే. ప్రభుని సంతోషపెట్టడం కోసమే. తన ప్రేమనంతా దేవునికి నైవేద్యం చేయడం కోసమే. అందుకే మానవమాత్రులు ఆమె ప్రేమను పంచుకోలేదు. వివాహం క్రీస్తుకూ శ్రీసభకూ వుండే ఐక్యభావం సూచిస్తుంది. కాని కన్యాత్వం క్రీస్తుకూ కన్యకూ వుండే ఐక్యభావం సూచిస్తుంది. క్రీస్తుకే వివాహమైన వధువు కన్య కావున మరియు పాపంలేకుండా పుట్టడానికీ, కన్యగా వుండిపోవడానికీ కారణం ఒక్కటే. దేవునికి తల్లి అయ్యేందుకు, దేవునికి అంకితమయ్యేందుకు. ఈలా కన్యగా వుండిపోయి • మరియ నిండు హృదయంతో ప్రభువును ప్రేమించేది. పూర్వవేదం చదువుకుంటూ ఆ