పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/147

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

3. భక్త విజయం

మనవిమాట

"భక్త విజయం" అనే ఈ గ్రంథంలో అబ్రాహాము, సమూవేలు మొదలైన భక్తుల కథలను వివరించాం. బైబుల్లోని భక్తిమంతమైన అధ్యాయాలను కొన్నిటిని ఎన్నుకొని వాటిమీద వ్యాఖ్య చెప్పాం. ఈ కథలను పూర్వమే బైబులు భాష్యం 102-105 సంచికల్లో ప్రచురించాం. ప్రతి కథలోను సందర్భం, వివరణం, ప్రార్థనాభావాలు అనే మూడంశాలు వుంటాయి.

ఇక్కడ చేర్చిన 17 కథల పవిత్ర గ్రంథాన్ని చదువుకొని భక్తితో మననం జేసికోవడానికి ఉద్దేశింపబడినవే. ఈ గ్రంథంద్వారా మన పాఠకులు బైబులుతో పరిచయం కలిగించుకొని దైవానుభూతిని పొందుతారని ఆశిస్తున్నాం, ఇది మూడవ ముద్రణం.

విషయ సూచిక

1. ఈసాకు బలి 140 2. సంసోను మరణం 144 3. సమూవేలు పిలుపు 147 4. ప్రభువు సౌలుని నిరాకరించడం 151 5. దావీదుకు అభిషేకం 155 6. దావీదు - గొల్యాతు 157 7. నాతాను ప్రవచనం 161 8. దావీదు పాపం 164 9. సొలోమోను స్వప్నం 169 10. రాజ్యవిభజనం 173 11. సారెఫతు వితంతువు 177 12. కర్మెలు కొండమీద యేలీయా 180 13. హోరేబి కొండమీద యేలీయా 184 14 నాబోతు ద్రాక్షతోట 188 15. ఏలీయాకు వారసుడుగా ఎలీషా 192 16. నామాను కుష్ట నయంగావడం 196 17. సౌలు పరివర్తనం 200 - ప్రశ్నలు 206