పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆదాము పాపంచేసి ఈ దైవసాదృశ్యాన్ని కోల్పోయాడు. నరుడు దేవుడు సంకల్పించు కున్నట్లుగా జీవించడం మానివేసాడు. కాని నరజాతి యంతటిలో దేవునికి పోలికగా, దేవుని సంకల్పం ప్రకారం జీవించిన ఏకైక మానుషవ్యక్తి మరియ. నరుణ్ణి గూర్చిన దేవుని ఆశయాలన్నీ ఆమెయందు సంపూర్ణంగా నెరవేరాయి. ఈ తల్లి మనంకూడ దేవునికి పోలికగా మెలగాలని కోరుకుంటుంది. అనగా, మన తలపులు, పలుకులు చేతలు దివ్యలకు తగినట్లుగా వుండాలని వాంఛిస్తుంటుంది. తన వేడుదలవలన ఈ భాగ్యాన్ని మనకు సంపాదించి పెడుతుందికూడా .

మరియు పరమపవిత్రురాలు అన్నాం. మనం పతిత మానవులం. అయినా ఆమె మనలను అసహ్యించుకోదు. మనతో సంబంధం త్రెంచివేసుకోవాలి అనుకోదు. ఆ విమలమూర్తి మన నరజాతికి చెందిన స్త్రీ .తన బిడ్డలమైన మనం కూడ వైమల్యంతో జీవించాలనే ఆమె కోరిక. అంచేత ఆమె మనలను పవిత్రమూర్తియైన భగవంతుని దాపులోనికి తీసుకొని వస్తుంది. తాను క్రీస్తు సాన్నిధ్యంవలన ధన్యురాలు ఐంది. అలాగే మనమా క్రీస్తు సాక్షాత్కారం పొంది, దైవత్వాన్ని చేకొని దివ్యజీవితం జీవించేలా చేస్తుంది.

మరియు మాతృమూర్తి, ఆ విశ్వజనని క్రీస్తు శిశువుని లాగే మనలను తన గర్భంలో ఇముడ్చుకుంటుంది. ఆ దైవ శిశువునులాగే మనలనూ గారాబంతో సాకుతుంది. పెంచి పెద్దచేస్తుంది. మన అక్కరలు బాగోగులు ఆ తల్లికి తెలియనివికావు. ఆ విశుద్దమూర్తి మనకోసం నిత్యమూ ప్రార్ధిస్తుంటుంది. మనంకూడ వినిర్మల జీవితంజీవించి తన రూపురేఖలు అలవరచుకునేలా చేస్తుంది, ఆ పునీతమాతకు బిడ్డలం కావడం మన భాగ్యవిశేషం.

2. కన్యమాత

నాల్గవ శతాబ్దపు భక్తుడు గ్రెగొరి నీస్సా మరియను ప్రశంసిస్తూ "మోషే కొండవద్ద చూచినపొద కాలుతూ కూడ భస్మంకాలేదు. మరియ దైవతేజస్సును గర్భంలో ధరించినా కూడా కన్యాత్వం కోల్పోలేదు. ఆ తేజస్సే ఆ పొదను కాపాడింది" అని వ్రాసాడు. ప్రాచీనకాలం నుండి వస్తున్న క్రైస్తవ సంప్రదాయం ప్రకారం మరియ నిత్యకన్య .ఇక్కడ కన్యమాతను గూర్చి ఆరంశాలు విచారిద్దాం :

1. మరియ కన్యమాత అంటే ఏమిటి?

89 పవిత్రహృదయ బిడ్డను కనకముందు, కన్న తరువాత కూడ కన్యగానే వుండిపోయింది. అందుచే క్రైస్తవ ప్రపంచం ఆమెను "ధన్యురాలైన నిత్యకన్య" అని కొనియాడుతూంటుంది.