పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/119

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కల్లలాడేవాళ్న అపనిందలు పట్టించేవాళూ శాపగ్రస్తులు ఆలాంటివాళ్ళు శాంతియుతంగా జీవించేవాళ్ళను నాశం జేస్తారు అపదూరులు మోపేవాళ్లు చాలమందిని నాశంజేసి తావునుండి తావకు తరిమికొట్టారు ఆ దుషులు బలమైన పట్టణాలను కూల్చివేసారు ప్రముఖుల గృహాలను కూలద్రోసారు ఇంకా వాళ్లు యోగ్యురాళ్ళయిన యిల్లాళ్ళకు విడాకు లిప్పించి వారి కష్ణార్జితాన్ని అపహరించారు అపదూరులు మోపేవాని మాటలు నమ్మేవాడు శాంతినీ విశ్రాంతినీగూడ కోల్పోతాడు - సీరా 28,13-16. కొంతమంది సులభంగా దేవుని పేరుమీదిగా వొట్టుపెట్టుకొంటారు. ప్రభువు నామాన్ని అంత తేలికగా ఉచ్చరించ కూడదు.

నీవు వట్ట పెట్టుకోవద్దు పరిశుధుడైన ప్రభువు నామాన్ని తేలికగా ఉచ్చరించవద్దు - సీరా 23,9.

అన్యలనుగూర్చి మనం వినే చెడ్డ వార్తలన్నీ నమ్మకూడదు. అసలు వాళ్ళు పాడుపని చేయకుండానే వుండవచ్చు.

నీ మిత్రుడు ఏదో పాడుపని చేశాడని వార్త పడితే అతన్నే అడుగు, అతడాలాంటి పనిచేసివుండకపోవచ్చు ఒకవేళ చేసినా మళ్ళా దాన్ని చేయడు, నీ ప్రక్కవాడేదో పాడుమాట చెప్పాడని వార్తపడితే అతన్నే అడుగు, అతడామాట చెప్పివుండకపోవచ్చు ఒకవేళ చెప్పినా మళ్ళా ఆ మాట చెప్పడు, నీ మిత్రునిగూర్చి యేదో వదంతి పడితే అతన్నే అడుగు, అది వట్టి అపనింద కావచ్చు మనం విన్నదాన్నెల్ల నమ్మకూడదు ఒక్కోసారి నరునికి నోరు జారవచ్చు కాని అతడా మాటను ఉద్దేశపూర్వకంగా అని వుండక పోవచ్చు - సీరా 19, 13-16.

పైన మనం మాటలద్వారా చేసే తప్పలను చాలచూచాం. ఏ నరుడూ తన నాల్కను పూర్తిగా అదుపులో పెట్టుకోలేడు. కనుక నోరు జారకుండావుండే వరప్రసాదం దయచేయమని మనం దేవుణ్ణి వేడుకోవాలి.