పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/102

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విజ్ఞని విజ్ఞత యిమిడివుంది
కాని మూర్జుని అజ్ఞానం వాణ్ణి పెడత్రోవ పట్టిస్తుంది.
ప్రభువు దుష్టుని బలిని అసహ్యించుకొంటాడు
సజ్జనుని ప్రార్ధన వలన ప్రీతి జెందుతాడు.
దుఘ్టనికి పోకడలు ప్రభునికి నచ్చవు
అతడు ధర్మాత్ముణ్ణి మెచ్చుకొంటాడు.
ప్రభువు దుఘ్టనికి దవ్వుగా వుంటాడు
కాని అతడు సజ్జనుని వేడికోలును ఆలిస్తాడు.
మూరుడు నూరుదెబ్బలు కొట్టినా నేర్చుకోలేనంత
వివేకశీలి ఒక్కసారి మందలిస్తేనే నేర్చుకొంటాడు.
వినయమూ దైవభీతి కలవాడు
సంపదలూ గౌరవమూ దీర్ఘాయువూ పొందుతాడు
దుష్టుని త్రోవ ముండ్లతోను ఉరులతోను నిండి వుంటుంది
జీవితంపై ఆశకలవాడు ఆ త్రోవ త్రోక్కడు.
దుష్టునికి మంచిరోజులు లేవు
అతని దీపం గుప్పున ఆరిపోతుంది
సత్పురుషుడు దుష్టునికి చిక్కి భ్రష్టుడు కావడం,
చెలమ చెడిపోవడంలాంటిది,
బావి మలినం గావడంలాంటిది.
దుష్టులకు న్యాయమంటే యేమిటో తెలియదు
ప్రభువు భక్తులకు న్యాయం బాగా తెలుసు - సామె 12,3, 13.9.21, 14,8, 15, 8-9, 29, 17,28, 22,45. 24, 20, 25,26. 28, 5.
న్యాయనిర్ణయ దినాన దుష్టులు సజ్జనులను జూచి ఆశ్చర్యపోయి ఈలా తలుస్తారు.
పూర్వం మనం ఇతన్ని జూచి నవ్వాం
ఇతన్ని గేలిచేసాం, కాని మనమే పిచ్చివాళ్ళం
ఇతనిది వట్టి వెర్రిజీవితం అనుకొన్నాం
ఇతడు నికృష్టమైన చావు చస్తాడనుకొన్నాం
కాని ఇప్పుడితడు దేవుని పుత్రుడుగా
చలామణి ఔతున్నాడు
ప్రభువు భక్తుడుగా గుర్తింపు పొందుతున్నాడు