పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/294

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మనంతట మనం భగవంతుడ్డి వెదుక్కుంటూ పోవడంగాదు. అతడు మనలను వెదుకుంటూ రావడం. ఫ్రెంచి తత్వజ్ఞడు పాస్కాలు వ్రాసిన ఓ గ్రంథంలో భగవంతుడు ಅಘ್ಯುತ್ ఈలా అంటాడు. "నేను నీ వద్దకు వచ్చాను గనుకనే నీవు నన్ను వెదక గలిగావు". భక్తుడు ఆగస్టీనుకూడ "ప్రభూ? నేను నీ కొరకు అన్ని తావుల్లో వెదుకుతూ వచ్చాను. కాని నీవు మాత్రం ఇంతవరకు నా హృదయంలోనే దాగుకొని వున్నావు" అన్నాడు. అనగా భగవంతుడు ఆ భక్తుని హృదయంలో వుండి దాన్ని ప్రనబోధించడం వలననే అతడు దేవుణ్ణి వెదకడం ప్రారంభించాడు.

మరియమాత బాలయేసును దేవాలయానికి కొనిపోయింది. అదే సమయంలో సిమ్యోను అనే వృద్దుడు ఆత్మచే ప్రబోధితుడై దేవాలయానికి వచ్చాడు - లూకా 2, 27. ఇతడు చాల యేండ్లనుండి యిస్రాయేలు పునరుద్ధరణాన్ని అభిలషిస్తున్నాడు. ఆ పునరుద్ధరణాన్ని ప్రసాదించే మెస్సీయాను కండ్గార చూచిందాకా కన్నులు మూయవని పరిశుద్దాత్మ అతనికి హామీ యిచ్చింది. ఇది ప్రబోధమే.
పౌలు తన మూడవ ప్రేషిత ప్రమాణములో మాసెడోనియాలోని ఫిలిప్పి పట్టణం నదీ తీరాన గుమికూడిన స్త్రీలకు ప్రసంగించాడు. వారిలో లూదియా అనబడే ఆమె హృదయాన్ని దేవుడు ప్రబోధింపగా ఆమె జ్ఞానస్నానము పొందింది - అచ 16, 14 తరువాత ఆమె అపోస్తలులకు ఆతిథ్యమిచ్చింది. అక్కడ అందరు స్త్రీలుంటే దేవుడు ఆమె హృదయాన్నే ఎందుకు ప్రబోధించాడో ఎవరు చెప్పగలరు?
మొదట ఆయా కార్యాలను అభిలషించడానికి, అటు పిమ్మట వాటిని కొనసాగించడానికీ వలసిన సామర్థ్యమిచ్చేవాడు ప్రభువేనన్నాడు పౌలు - ఫిలి 2, 13. అనగా భగవత్రబోధం వలననే ఆయా సత్కార్యాలకు పూనుకొంటామని భావం. యెహెజేలు ప్రవచనంలో ప్రభువు "నేను మీలోని రాతిగుండెను తీసివేసి దాని తావన క్రొత్తదైన మాంసపు గుండెను నిల్పుతాను" అంటాడు - 86, 26. ఇక్కడ రాతి గుండె విధేయతలేని జీవితాన్ని మాంసపు గుండె విధేయాత్మక జీవితాన్ని సూచిస్తుంది. అనగా దేవుడు మన హృదయంలో ఈ మార్పును గలిగించాలి. ఈ ప్రబోధాన్ని మనకీయాలి
పైన నిద్రించే వ్యక్తి ఉపమానం వాడాం. మనం ప్రబోధించినపుడు నిద్రించే వ్యక్తి పడకమీద నుండి లేవవచ్చు లేవకపోవచ్చు. ఇదే విధంగా మనంకూడ ప్రబోధక వరప్రసాదాన్ని గుర్తించి ఆయా పుణ్యకార్యాలకు పూనుకోవచ్చు. పూనుకోకపోవచ్చుగూడ, నరుడు స్వతంత్రుడు కనుక ఒకోమారు పరిశుద్దాత్మ ప్రబోధాలను పెడచెవిని పెడుతూంటాడు. ఇది చాల పెద్దయనర్థకం, విశ్వాసులు భక్తిభావంతో తమ హృదయంలోని ప్రబోధాలను గుర్తించడానికి అలవాటు పడాలి. ఆత్మ మన అంతరాత్మలో మెల్లగా మాట్లాడుతూంటూంది, అభిలాషలు పుట్టిస్తూంటుంది. జపతత్పరులేగాని ఈ యాత్మ ప్రబోధాలను అభిలాషలను గుర్తించలేరు.