పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/293

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తినడం, నిద్రించడం, ఉద్యోగం చేయడం. డబ్బుజేసికోవడం మొదలైన పనులు ప్రాకృతిక కార్యాలు. మనం సదుద్దేశం ద్వారా, ఉద్ధరణ వరప్రసాదం ద్వారా ఈ ప్రాకృతిక కార్యాలను దివ్యకార్యాలుగా మార్చుకోవాలి. పైగా స్వతస్సిద్ధంగా దివ్యకార్యాలైన సోదరప్రేమ, ప్రార్ధనం, సంస్కారాలు మొదలైన వున్నాయి. మనం వీటిని గూడా ఆచరించాలి. ఉద్ధరణ వరప్రసాదం ద్వారానే గాని ఇవన్నీ సాధ్యం కావు. కనుక ఈ వరప్రసాదాన్ని ప్రసాదించమని పావనాత్మను అడుగుకొంటుండాలి.

3. ప్రబోధాత్మక వరప్రసాదం

కొలనులోని పద్మం రాత్రి ముకుళించుకొని పోతుంది. ఉదయాన్నే సూర్యకిరణాలు దాన్ని ప్రబోధించి మేలుకొల్పుతాయి. ఇక రోజంతా పద్మం శోభాయమానంగా విప్పారి వుంటుంది. ఆధ్యాత్మిక జీవితంలో మన ఆత్మకు గూడ ఓపాటి ప్రబోధము లేక మేలుకొల్పు లభిస్తుంది. ఈ మేలుకొల్పునిచ్చే వరప్రసాదాన్నే ప్రబోధాత్మక వరప్రసాదం అంటాం. ఈ మేలుకొల్పు వలన మన యాత్మంగూడ పూవులాగ విప్పారుతుంది. చైతన్యం పొంది దివ్యకార్యాలకు పూనుకొంటుంది.


ప్రాకృతిక రంగంలో ఏదైనా ఓ పని చేయాలంటే మున్ముందుగా ఆ కార్యాన్ని గూర్చిన ఆలోచనా, అభిలాషా వుండాలి. ఉదాహరణకు, ఇల్లు కడుతున్నాం అనుకుందాం. మున్ముందుగా ఆ యింటి యొక్క అవసరాన్నీ లాభాన్నీ ఆలోచించి చూచి, దాన్ని అభిలషించిన పిదపనేగాని గృహనిర్మాణానికి పూనుకోము. ఇదేరీతిగా ఆధ్యాత్మిక జీవితంలో గూడ ఆయా పుణ్యకార్యాలను చేయాలంటే - ఉదాహరణకు జపము, సోదరప్రేమ పవిత్రజీవనము మొదలైన వాటిని పాటించాలంటే - మున్ముందుగా ఆలోచనా అభిలాషా అవసరం. ఇదే ప్రబోధం. కాని గృహనిర్మాణాది ప్రాకృతిక కార్యాలను మనమే స్వయంగా ఆలోచించగలం. అభిలషించగలం. ఆధ్యాత్మిక కార్యాలను మాత్రం మనంతట మనం అభిలషించలేం. పరిశుద్దాత్మే మన యాత్మను ప్రబోధించి ఆధ్యాత్మిక కార్యాలను అభిలషించేలా చేస్తుంది.


ఓ నిదురించే వ్యక్తిని పెద్దస్వరంతో పిల్చి తట్టి లేపామనుకుందాం. అతడు మేల్మొని పడక మీదనుండి లేస్తాడు. ఇక్కడ మేల్కొందీ లేచిందీ ఆ వ్యక్షే ఐనప్పటికీ, అతన్ని పిల్చింది తట్టింది మనం. ఈ పిలవడానికీ, తట్టడానికీ అతని సహకారమేమీలేదు. ఈ రీతినే ప్రబోధాత్మక వరప్రసాదాన్నిగూడ మన సహకారం లేకుండానే తలవని తలంపుగా భగవంతుడు ఇస్తుంటాడు. అందుకే 529లో జరిగిన ఓరంజ్ మహాసభ "భగవంతుడు వరప్రసాదమిచ్చేది నరుడు తొలుత ప్రార్ధించినందుకు గాదు. మరి భగవంతుడు తొలుత వరప్రసాద మిచ్చాడు కనుకనే నరుడు ప్రార్ధింప కల్లుతున్నాడు" అని బోధించింది. ఈ వాక్యం ఒక్క ప్రార్థనకేగాదు ఆధ్యాత్మిక కార్యాలన్నిటినీ వర్తిస్తుంది. ఆధ్యాత్మిక జీవితమంటే