పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/278

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

క్రీస్తుద్వారా దేవునికి దత్తపుత్రులం గావటానికిగాని మోక్షాన్ని వారసంగా పొందడానికిగాని మనకు ఏ హక్కులేదు. ఏ యోగ్యతాలేదు. దైవస్వభావం వేరు మానుషస్వభావం వేరు. ఆ ప్రభువు నరులు చేరలేని జ్యోతిః ప్రవాహంలో నివసిస్తూంటాడు. దైహిక నేత్రాలేవీ ఆ దివ్యమూర్తిని ఇంతవరకు చూచి యెరుగవ - 1తిమో 6,16. ప్రభువుకూడ "నా ద్వారా తప్ప ఎవ్వడూ పితదగ్గరకు రాలేడు” అని చెప్పాడు - యోహా 14, 6. అనగా మనము దత్తపుత్రులం కావడమనేది కేవలం దేవుని కృప. మనంతట మనం ఎంత ప్రయత్నం చేసినా దేవుని పత్రులం కాలేం. క్రింది అంతస్తులో ఉన్నవాళ్ళు అటూ యిటూ ఎన్నిసార్లు తిరిగినా పై యంతస్తులోనికి పోలేరు. పై యంతస్తులోకి వెళ్ళాలంటే మెల్లెక్కిపోవాలి. మానవులనుగూడ దైవ పుత్రులనుజేసి పై యంతస్తులోనికి గొనిపోయే మెట్లవరుస క్రీస్తు. క్రీస్తు ద్వారా మనకు లభించే ఈ భాగ్యాన్ని తలంచికొని దేవునికి కృతజ్ఞలమై యుండాలి.

ప్రార్ధనా భావాలు

1. ఐదవ శతాబ్దానికి చెందిన భక్తుడు పెద్ద లియోపాపుగారు ఈలా వ్రాసారు. "క్రైస్తవుడా! నీ ఘనతను నీవు గుర్తించు. దైవస్వభావంలో పాలుపొందిన నీవు మళ్ళా నీ పూర్వపు అధోగతికి దిగజారకు. నీవు ఏ శిరస్సుకి, ఏ దేహానికి అవయవానివో జ్ఞప్తికి దెచ్చుకో. నీవు చీకటి నుండి వైదొలగి దైవరాజ్యపు వెలుగులో ప్రకాశించావని జ్ఞాపకముంచుకో. జ్ఞానస్నానంద్వారా వవిత్రాత్మకు దేవాలయమయ్యావు. పాపకార్యాలద్వారా అంతటి గొప్ప అతిథిని నీ హృదయం నుండి పారదోలకు, పిశాచానికి మరల దాసుడివి కాబోకు. క్రీస్తు తన అమూల్యమైన రక్తంతో నిన్ను విమోచించాడు. అంతదయతో నిన్ను రక్షించిన దేవుడు ఓనాడు నీకు నిష్పాక్షికమైన తీర్పు తీరుస్తాడు సుమా!" ఈ వాక్యాలు పలుసార్లు భక్తి భావంతో మననం చేసికో దగ్గవి.

2. ఓ చిన్నపిల్లవాడు చెట్టమీది పండు కోసికోబోయాడు. కాని అది వాడి కందలేదు. ఆ బాలుడి తండ్రి వాణ్ణి చేతులతో పైకెత్తి పట్టుకోగా వాడా పండు కోసికొన్నాడు. దేవుడు మనకు దత్తపుత్రత్వాన్ని దయచేయడమంటే, మనలను తన చేతులతో పైకెత్తిపట్టుకోవడం. మనం మోక్షం అనే పండుని అందుకొనేలా చేయడం.

3. "నీ వరప్రసాదం ప్రాణంకంటె మెరుగైంది. కనుక నేను నిన్నుస్తుతిస్తాను” అంటుంది కీర్తన 68,4. అన్నికంటె ముఖ్యమైంది మన ప్రాణం. కాని దేవుని వరప్రసాదం ఈ ప్రాణంకంటెగూడ గొప్పది. అసలు మనకు ప్రాణాన్ని దయచేసేదీ ఆ ప్రాణాన్ని