పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/233

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

2. దావీదు కుమారుడు అబ్సాలోమ దౌర్జన్యంతో తండ్రిరాజ్యం ఆక్రమించు కొన్నాడు. దావీదు అతనికి భయపడి పారిపోయి ఓ యెడారిలో తల దాచుకున్నాడు. తండ్రిని ఏవిధంగా పట్టుకోవాలా అని అబాలోము మంత్రులను ఆలోచన అడిగాడు. అహిటోఫెలు అనే సలహాదారుడు తాను ఆ రాత్రే సైన్యంతోపోయి దావీదును పట్టుకొని వస్తానన్నాడు. హుషయి అనే సలహాదారుడు అబ్వాలోమే సైన్యంతోపోయి దావీదుని పట్టుకొంటే బాగుంటుందని సూచించాడు. రాజు హుషయి సలహాను పాటించాడు. అహిటో ఫెలు ఆలోచనను అనాదరం చేసినందుకు అతనికి మొగం కొట్టినట్లయింది. ఆ చిన్నతనాన్ని భరించలేక అహిటోఫెలు స్వీయగ్రామానికెళ్ళి అక్కడ ఉరివేసుకొని చచ్చాడు. -2 సమూ 17, 23.

3.సిరియా దేశపు సైన్యాధిపతియైన నామాను కుష్టరోగియై చికిత్సకోసం యిస్రాయేలు ప్రవక్త యెలీషా వద్దకు చచాడు. ఎలీషా అతనికి మొగమైనా చూపించకుండానే యోర్గాను నదికివెళ్ళి స్నానం చేయవలసిందని సేవకునిచేత కబురు పెట్టించాడు. నామాను మండిపడ్డాడు. స్నానం చేసికోవాడానికి మా దేశంలో నదుల్లేక మీ దేశానికి వచ్చాననుకొన్నారా అంటూ సిరియాకు వెడలిపోవడానికి సంసిద్దుడయ్యాడు. కని అతని సేవకుడు "అయ్యా! ప్రవక్తయేదైన పెద్దపనిచెస్తే నీవు తప్పకుండ చేసేవాడివేకదా? నదిలో స్నానం చేయమని ఈపాటి చిన్న పనిచెస్తే చులకన చేయడం దేనికి? ప్రవక్తమాట పాటించడం మేలు" అని హితోపదేశం చేసాడు. నామాను ఆ వుపదేశం విని నదిలో స్నానం చేసి కుష్టనుండి విముక్తుడయ్యాడు. - 2 రాజు 5, 13.

4. దేవుడు తన సేవకుడైన యోబు మహా భక్తుడని మెచ్చుకొన్నాడు. కాని పిశాచం అతని భక్తిని నమ్మలేదు. దేవుని అనుమతిపై యోబుని శోధించి పరీక్షింప గోరింది. యోబుకి నానా కష్టాలు కలిగించింది. అతని ఆస్తంతా నాశమైపోయింది. అతని దేహమంతా మహా వ్రణంకాగా, చీమూ నెత్తురూ కారుతున్నాయి. బంధువులంతా యోబుని ఈసడించుకున్నారు. అతడు ఒంటరిగా బూడిదమీద కూర్చున్నాడు. యోబు మిత్రులుగూడ అతడు దుర్మార్గుడై యుండాలి లేకపోతే అలాంటి కష్టాలు వస్తాయా అని శంకించారు. అలాంటి పరిస్థితుల్లో యోబు భార్య దేవుణ్ణి దూషించమని పెనిమిటికి సలహా యిచ్చింది. అయినా యోబు మహాభక్తుడు. ఆతడు “మూరురాలా! మనం దేవుడిచ్చే మేళ్లు అనుభవించినట్లే అతడిచ్చే కీడులూ అనుభవించాలి" అని జవాబిచ్చాడు - యోబు 2, 9-10.

5. యూదుల నాయకులు ప్రభుని సంహరించడానికై కుట్రలు పన్నుతూన్నారు. వాళ్ళంతా ప్రధానయాజకుడైన కైఫా యింటిలో సమావేశమై మంత్రాంగం నడిపారు.