పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/183

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రెండవ వాటికను సభ నూత్న పెంతెకోస్టు లాంటిది. అది తిరుసభకు తన ప్రేషిత స్వభావాన్ని మళ్ళా జ్ఞప్తికి తెచ్చింది. మూడవ వేయి సంవత్సరాల్లో క్రైస్తవులందరు ప్రేషితులుగా పనిచేయాలని హెచ్చరించింది. వాళ్లు పిండిని పొంగజేసే పులుపిడి ద్రవ్యంలా వుండాలని చెప్పింది. నరులంతా క్రీస్తుచే ప్రభావితులై దైవకుటుంబంగా మారాలని వాకొంది.

ఇటీవలే యేసుక్రీస్తు జూబిలీ ఉత్సవం జరుపుకొని ప్రభువునుండి ప్రేరణ పొందాం. తొలినాటి క్రైస్తవులనులాగే ప్రభువు మనలనుకూడ లోకంలోనికివెళ్లి తన్ను గూర్చి ప్రకటించమని ఆదేశించాడు. ప్రేషితత్వమే నేటి తిరుసభ ప్రధాన లక్షణం అనుకోవాలి.

1. వాటికన్ సభ నూత్న తిరుసభను సిద్ధంజేసిన తీరు

ఉత్ధాన క్రీస్తు సాన్నిధ్యం తిరుసభలో వుందనీ, ఈ సాన్నిధ్యం వలన తిరుసభ తాను మారి లోకాన్ని గూడ మారుస్తుందనీ 23వ జాన్ పోపుగారు అభిప్రాయపడ్డారు. ప్రపంచంలోని జనమంతా సోదర భావంతో, ప్రేమ భావంతో ఐక్యంగావాలి. ఈ యైక్యతను సాధించడానికి తిరుసభ సహాయపడుతుంది. ఈ శ్రీసభ లోకం బాగోగులను పట్టించుకొనేది. లోకాన్ని దేవుని చెంతకు చేర్చేది. లోకం సుఖదుఃఖాలు క్రైస్తవులవి కూడ. ప్రపంచానికి సంభవించే కష్టసుఖాలు వారికిగూడ సంభవించినట్లే వాళ్ళు క్రీస్తుతో ఐక్యమై, ఆత్మ దారి జూపుతూండగా, దైవరాజ్యంవైపు పయనిస్తారు. ఇతరులకు కూడ రక్షణ సందేశాన్ని ఎరిగిస్తారు. అందుకే క్రైస్తవులు ఎప్పుడూ ఇతర ప్రజలతో కలియగోరుతారు. ఇతరుల్లో కూడ క్రీస్తుని చూచి వారితో ఐక్యమై, వారిని తండ్రియైన దేవుని రాజ్యంలోనికి చేర్చగోరతారు. ఈ ప్రధాన భావంతో వాటికన్ సభ తిరుసభలో మార్పు తీసికొని వచ్చింది.

తిరుసభ ప్రపంచమంతటాను, ఇండియాలో కూడ రెండవ వేయి క్రీస్తు జయంతి ఉత్సవాన్ని ఘనంగా జరుపుకొంది. ఈ సందర్భంలో క్రైస్తవులంతా గూడ భక్తి శ్రద్ధలతో దేవుని వాక్యం విన్నారు. దివ్యసత్ర్వసాద బలిలో పాల్గొన్నారు. విశ్వాసులు క్రీస్తునుండి ప్రేరణం పొంది, ఆ ప్రభువు పంపగా వెళ్ళి అతని ప్రేమను లోకానికి తెలియజేయడానికి సిద్ధమయ్యారు. సువార్త సందేశంతో, దాని శక్తితో ప్రపంచాన్ని మార్చి వేయడం తిరుసభ పని. ఈలా మార్పు చెందిన ప్రపంచమే దైవరాజ్యం. లోక్షంలో శ్రీసభ పులిపిడి ద్రవ్యంలాంటిది. పులిపిడి ద్రవ్యం పిండిని పొంగజేస్తుంది. ఆలాగే తిరుసభ సువార్త సందేశంతో ప్రపంచం పొంగి నిర్మలమూ ఉదాత్తమూ అయ్యేలా చేస్తుంది. ఈ సభ