పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/182

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

4. నూత్న తిరుసభ

విషయ సూచిక

1.వాటికన్ సభ నూత్న తిరుసభను సిద్ధంజేసిన తీరు

2.మూడవ సహస్రాబ్దంలో తిరుసభ రూపం

3.తిరుసభ సభ్యులు ఎవరు?

4.మౌలిక సంఘాలు

5.నూత్న తిరుసభకు నూత్న పరిచర్యలు

  • వాక్యబోధ ముఖ్యాంశం కావాలి
  • . వేదబోధక తిరుసభ
  • . ఆత్మ ప్రేరిత తిరుసభ
  • . ప్రపంచంతో కలసిపోయే తిరుసభ

6. తిరుసభలో నూత్న దృక్పథాలు.

నూత్న తిరుసభ ప్రేషిత తిరుసభగా పుట్టింది. క్రీస్తు శిష్యులతో వుండి వారికి అద్భుతాలు చేసి చూపించాడు. బోధలు చేసాడు. ఉత్థానానంతరం వారికి దర్శనమిచ్చాడు. శిష్యులు అతడు జీవించివున్నాడనీ మృత్యువుని జయించాడనీ విశ్వసించారు. ఉత్దాన క్రీస్తు తానే సువార్తనని శిష్యులకు తెలియజేసాడు. శిష్యులను ఈ సువార్తను లోకం నలుమూలల ప్రకటించమని ఆదేశించాడు. ఆత్మ తమమీదికి దిగివచ్చి తమకు ప్రసాదించిన బలంతో శిష్యులు యేసే రక్షకుడని ఎల్లయెడల బోధించారు. చిన్న బృందమైన శిష్యులు పంపబడ్డ వాళ్ళుగా (పేషితులుగా) నలుమూలలకు వెళ్లారు. పంపబడిన వాళ్ళుగానే వాళ్ళు మొదటి తిరుసభ అయ్యారు. తిరుసభ ప్రధాన లక్షణం ప్రేషితత్వమే (పంపబడ్డం). తిరుసభ పరిపాలనం, కర్మకాండలు, సిద్ధాంతాలు బోధలు అన్నీ కూడ ప్రేషితత్వాన్ని ఆధారం జేసికొనే ఉద్భవించాయి. కాని క్రమేణ ప్రేషితత్వం మరుగుపడిపోయి ఇతరాంశాలు ప్రాముఖ్యాన్ని పొందాయి. ప్రేషితత్వం తిరుసభ పనుల్లో వొకటి, అంత ముఖ్యమైన పనికాదు అనే భావాలు ప్రచారంలోకి వచ్చాయి. ఇందువల్ల తిరుసభ స్వభావమే మారిపోయింది. విశేషంగా ఇండియా తిరుసభ ఇతర ప్రజలతో సంబంధాలు త్రేంచుకొని తనకు తానుగా వుండిపోయింది.